IPL Auction 2025 Live

DK Shivakumar on CM Post: కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే మీరు సీఎం అవుతారా, డికె శివకుమార్ ఆసక్తికర సమాధానం ఇదిగో, రేపు వెలువడనున్న కర్ణాటక ఎన్నికల ఫలితాలు

పలు ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ కే ఆధిక్యత వస్తుందని అంచనా వేశాయి.

DK Shivakumar (Photo Credits: ANI)

Bengaluru, May 12: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు మరి కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. పలు ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ కే ఆధిక్యత వస్తుందని అంచనా వేశాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సీఎం ఎవరనే చర్చ కూడా పెద్ద ఎత్తున సాగుతోంది. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది.

ఈ నేపథ్యంలో జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో డీకే శివకుమార్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మీరే ముఖ్యమంత్రి అవుతారా అనే ప్రశ్నకు సమాధానంగా... తొలుత కాంగ్రెస్ గెలవడం ముఖ్యమని, పార్టీ గెలిచిన వెంటనే తన కార్యాచరణ మొదలవుతుందని అన్నారు.

అతి పెద్ద పార్టీగా అవతరించనున్న కాంగ్రెస్, కర్ణాటక ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు ఇవిగో, మళ్లీ కింగ్ మేకర్ కానున్న కుమార స్వామి

అలాగే బీజేపీ, కాంగ్రెస్ లు తమను సంప్రదించాయని, తాము ఎవరికి మద్దతిస్తామో సరైన సమయంలో చెపుతామన్న జేడీఎస్ సీనియర్ నేత తన్వీర్ అహ్మద్ వ్యాఖ్యలపై స్పందిస్తూ... దీనిపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయబోనని అన్నారు. వాళ్ల పార్టీని, జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వాళ్లు వాళ్లకిష్టమైన నిర్ణయం తీసుకోవచ్చని చెప్పారు.

ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు వచ్చేశాయి. హంగ్ దిశగా కర్ణాటక, మళ్లీ కింగ్ మేకర్ కానున్న కుమార స్వామి, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్య టఫ్ ఫైటింగ్

ఎగ్జిట్ పోల్స్‌కు వాటి సొంత థియరీ ఉంటుందని డీకే అన్నారు. ఎగ్జిట్ పోల్స్ శాంపుల్స్ ఆధారంగా తాము ముందుకు వెళ్లబోమని... ఎగ్జిట్ పోల్స్ లో కొన్ని సక్సెస్ అయ్యాయని, మరికొన్ని ఫెయిల్ అయ్యాయని, అందుకే వాటిని పట్టించుకోబోమని స్పష్టం చేశారు. తన శాంపుల్ సైజ్ చాలా పెద్దదని... తన శాంపుల్స్ ప్రకారం కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించడం మాత్రమే కాకుండా, కావాల్సినంత మెజార్టీని సాధిస్తుందని చెప్పారు.



సంబంధిత వార్తలు

Maharashtra Election Result 2024: మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు, 288 నియోజకవర్గాల వారీగా గెలిచిన అభ్యర్థుల జాబితా ఇదిగో

Jharkhand Election Result 2024: జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, నాలుగో సారి సీఎం కాబోతున్న హేమంత్‌ సొరేన్‌, 56 స్థానాల్లో జేఎంఎం కూటమి విజయభేరి, 26 స్థానాలతో సరిపెట్టుకున్న ఎన్డీఏ కూటమి

No Pharma City In Kodangal: కొడంగ‌ల్ భూసేక‌ర‌ణ విష‌యంలో వెన‌క్కు త‌గ్గిన సీఎం రేవంత్ రెడ్డి, అక్క‌డ‌ వ‌చ్చేది ఫార్మా సిటీ కాదు, ఇండ‌స్ట్రీయ‌ల్ పార్క్ మాత్ర‌మే

Priyanka Gandhi: మీ కోసం పోరాడుతా..తనపై నమ్మకం ఉంచి రికార్డు మెజార్టీతో గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన ప్రియాంక గాంధీ..ప్రజల వ్యక్తిగా పనిచేస్తానని వెల్లడి