Yashwant Sinha Joins TMC: అటల్‌జీ పాలన వేరు..మోదీ పాలన వేరు, బీజేపీకీ భారీ ట్విస్ట్ ఇస్తూ తృణమూల్ పార్టీలో చేరిన యశ్వంత్ సిన్హా, అన్ని వ్యవస్థలు నేడు బలహీనం అయ్యాయని ఆవేదన
దీదీ పార్టీ నేతలను లాగేసుకుంటున్న బీజేపీ పార్టీకి అక్కడ పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా నేడు మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో (Yashwant Sinha Joins TMC) చేరారు. కాగా గతంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాయ్‌పేయి ప్రభుత్వంలో యశ్వంత్ సిన్హా (Former BJP leader Yashwant Sinha) ఆర్థిక మంత్రిగా చేశారు. 83 ఏళ్ల యశ్వంత్ సిన్హా 2018లో బీజేపీ పార్టీకి స్వస్తి పలికారు.
Kolkata, March 13: పశ్చిమ బెంగాల్ ఎన్నికలు దగ్గరపడేకొద్ది అక్కడ రాజకీయాలు కీలక మలుపులు తిరుగుతున్నాయి. దీదీ పార్టీ నేతలను లాగేసుకుంటున్న బీజేపీ పార్టీకి అక్కడ పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా నేడు మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో (Yashwant Sinha Joins TMC) చేరారు. కాగా గతంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాయ్‌పేయి ప్రభుత్వంలో యశ్వంత్ సిన్హా (Former BJP leader Yashwant Sinha) ఆర్థిక మంత్రిగా చేశారు. 83 ఏళ్ల యశ్వంత్ సిన్హా 2018లో బీజేపీ పార్టీకి స్వస్తి పలికారు.
అసెంబ్లీ ఎన్నికలకు (West Bengal Assembly elections) ముందే బెంగాల్‌లో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. తన స్వంత నియోజకవర్గాన్ని వదిలిపెట్టి సీఎం మమతా బెనర్జీ.. నందీగ్రామ్ నుంచి పోటీ చేస్తోంద .కాగా టీఎంసీలో కీలకనేత అయిన సువేందు అధికారి గత ఏడాది ఆ పార్టీని వీడి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం దేశంలో అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయని యశ్వంత్ సిన్హా ఆరోపించారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్య వ్యవస్థల దృఢత్వంలోనే ప్రజాస్వామ్యం బలం ఉంటుందని, న్యాయవ్యవస్థతో పాటు అన్ని వ్యవస్థలు బలహీనమైనట్లు యశ్వంత్ తెలిపారు. మాజీ ప్రధాని అటల్‌జీ పాలన సమయంలో బీజేపీ ఏకాభిప్రాయంపై నడిచేదని, కానీ ప్రస్తుత ప్రభుత్వం అణిచివేయడం, స్వాధీనం పరుచుకోవడంపైనే దృష్టి సారించిందన్నారు. అకాలీదళ్, బీజేడీ.. బీజేపీని వీడాయని, ఆ పార్టీతో ఇప్పుడు ఎవరున్నారని యశ్వంత్ ప్రశ్నించారు.
Here's ANI Update
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని వారాల ముందు కేంద్ర ఆర్థిక మంత్రి, భారతీయ జనతా పార్టీ (బిజెపి) ప్రముఖ యశ్వంత్ సిన్హా శనివారం తృణమూల్ కాంగ్రెస్‌లో చేరడంతో రాజకీయాలు కొత్త మలుపు తీసుకున్నాయి. టిఎంసిలో చేరిన వెంటనే, సిన్హా ఇలా అన్నారు, "ఈ వయసులో నేను పార్టీ రాజకీయాలకు దూరం అయినప్పుడు మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉంది. నేను ఎందుకు పార్టీలో చేరి చురుకుగా తిరుగుతున్నాను? దేశం ఒక వక్ర మార్గం గుండా వెళుతోందని అసాధారణ పరిస్థితి నెలకొందని నేను చెప్పాలనుకుంటున్నానని తెలిపారు.
"ప్రజాస్వామ్యం యొక్క బలం ప్రజాస్వామ్య సంస్థల బలంలో ఉంది. న్యాయవ్యవస్థతో సహా ఈ సంస్థలన్నీ ఇప్పుడు బలహీనంగా మారాయి" అని ఆయన అన్నారు. "అటల్ జీ కాలంలో బిజెపి ఏకాభిప్రాయాన్ని నమ్ముతుంది, కాని నేటి ప్రభుత్వం అణిచివేత మరియు జయించగలదని నమ్ముతుంది. అకాలీస్, బిజెడి బిజెపిని విడిచిపెట్టింది. ఈ రోజు బిజెపితో ఎవరు నిలబడ్డారు?" అని సిన్హా ప్రశ్నించారు. కోల్‌కతాలోని తృణమూల్ భవన్‌లో డెరెక్ ఓ బ్రైన్, సుదీప్ బందోపాధ్యాయ, సుబ్రతా ముఖర్జీ సమక్షంలో తన కొత్త పార్టీలో చేరారు.