Lok Sabha Elections 2024: ఇద్దరు భార్యలుంటే మహాలక్ష్మి పథకం కింద రెండు లక్షలు, కాంగ్రెస్ అభ్యర్థి సంచలన హామీ, ఈసీకి ఫిర్యాదు చేసిన బీజేపీ
ఆ సొమ్ము నేరుగా మహిళ ఖాతాలో జమఅవుతుందని తెలిపారు.
Bhopal, May 11: మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రత్లాం (Ratlam) లోక్‌సభ నియోజకవర్గ కాంగ్రెస్ (Congress) అభ్యర్థి, కేంద్ర మాజీ మంత్రి కాంతిలాల్ భురియా (Kantilal Bhuria ) గురువారం సైలనాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో కాంతిలాల్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు రూ.లక్ష ఆర్థిక సాయం ఇస్తుందని తెలిపారు. ఆ సొమ్ము నేరుగా మహిళ ఖాతాలో జమఅవుతుందని తెలిపారు. ముస్లింలకు రిజర్వేషన్లు తొలగించి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇస్తాం, భువనగిరి సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా హామీ
అయితే, ఇద్దరు భార్యలు ఉన్న వ్యక్తి ఈ పథకం కింద రూ.2లక్షలు పొందుతారని పేర్కొంటూ వివాదాస్పదమయ్యారు. ‘కాంగ్రెస్ మేనిఫెస్టోలో మహాలక్ష్మి పథకం కింద ఏటా ప్రతి మహిళ ఖాతాలో రూ.లక్ష వేస్తామని హామీ ఇచ్చాం. ఇద్దరు భార్యలు ఉంటే ఇరువురికీ చెరో లక్ష చొప్పున రూ.2 లక్షలు వేస్తాం’ అని కాంతిలాల్ అన్నారు.ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.యూపీఏ ప్రభుత్వ హయాంలో గిరిజన వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేసిన ఆయన ఇలాంటి హామీలు ఇవ్వడంపై బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు.
Here's Video
కాంతిలాల్ వ్యాఖ్యలపై అధికార బీజేపీ తీవ్రంగా స్పందించింది. ఎన్నికల కమిషన్ కాంతిలాల్‌పై చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేసింది.బీజేపీ అధికార ప్రతినిధి నరేంద్ర సలుజా భూరియా కాంతిలాల్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. ఎన్నికల సంఘానికి ట్యాగ్ చేశారు. కాంతిలాల్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. రత్లాంలో మే 13న లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి.