IPL Auction 2025 Live

Monsoon Session 2020: ఎంపీలందరికీ కరోనా పరీక్షలు, వర్షాకాల సమావేశాల నేపథ్యంలో కోవిడ్-19 పరీక్షలు చేయించుకోవాలని తెలిపిన స్పీకర్ ఓం బిర్లా, సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 1 వరకు సమావేశాలు

సమావేశాల (Parliament Monsoon Session 2020) ప్రారంభానికి కనీసం 72 గంటల ముందు ఈ పరీక్షలు (MPs to Get COVID-19 Test Done 72 Hours Before) చేయించుకోవాలన్నారు. ఎంపీలు, మంత్రులతోపాటు సభలోకి వచ్చే అధికారులు, మీడియా ప్రతినిధులకు కూడా కరోనా పరీక్షలను తప్పనిసరి చేయాలన్నారు.సెప్టెంబరు 14 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో శుక్రవారం ఆయన (Lok Sabha Speaker Om Birla) అధికారులతో సమావేశమయ్యారు.

Lok Sabha Speaker Om Birla (Photo Credits: ANI|DD News)

New Delhi, August 29: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎంపీలు అందరూ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరనున్నట్లు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా తెలిపారు. సమావేశాల (Parliament Monsoon Session 2020) ప్రారంభానికి కనీసం 72 గంటల ముందు ఈ పరీక్షలు (MPs to Get COVID-19 Test Done 72 Hours Before) చేయించుకోవాలన్నారు. ఎంపీలు, మంత్రులతోపాటు సభలోకి వచ్చే అధికారులు, మీడియా ప్రతినిధులకు కూడా కరోనా పరీక్షలను తప్పనిసరి చేయాలన్నారు.సెప్టెంబరు 14 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో శుక్రవారం ఆయన (Lok Sabha Speaker Om Birla) అధికారులతో సమావేశమయ్యారు.

కరోనా నేపథ్యంలో వైరప్ వ్యాప్తికి అవకాశం లేని విధంగా పార్లమెంట్‌లో సీటింగ్ ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ముందు జాగ్రత్తగా సభ్యులందరికీ ఆర్టీ పీసీఆర్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్లు ఓం బిర్లా తెలిపారు. దీని వల్ల ఒకటి, రెండు రోజుల్లోనే రిపోర్టు తెలుస్తుందని అన్నారు. పార్లమెంట్ సిబ్బంది, అధికారులతోపాటు సమావేశాలను కవర్ చేసే జర్నలిస్టులు కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాలని చెప్పారు. కరోనాపై గుడ్ న్యూస్, దేశంలో 26 లక్షలు దాటిన డిశ్చార్జ్ కేసులు, యాక్టివ్ ఉన్న కేసులు 7,52,424 మాత్రమే, దేశంలో తాజాగా 76,472 కేసులు నమోదు, 62,550కు పెరిగిన మరణాల సంఖ్య

శుక్రవారం జరిగిన సమావేశంలో కేంద్ర ఆరోగ్యశాఖ, ఐసీఎంఆర్, డీఆర్డీవో, ఎయిమ్స్, ఢిల్లీ ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారని ఓం బిర్లా తెలిపారు. ఈ సందర్భంగా సభ్యులకు కరోనా పరీక్షల నిర్వహణ, ఏర్పాట్లపై వారితో చర్చించినట్లు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య సంస్థల పనితీరుకు కరోనా పెద్ద సవాలుగా నిలిచిందని ఓం బిర్లా అన్నారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ సభ్యులంతా కరోనా మార్గదర్శకాలు పాటించి వర్షాకాల సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని ఆయన కోరారు.

పార్లమెంటు సమావేశాల సందర్భంగా సభ్యులెవ్వరినీ ముట్టుకోకుండా, జీరో టచ్‌ సెక్యూరిటీ చెక్‌ ఏర్పాట్లు చేస్తున్నామని స్పీకర్‌ తెలిపారు. సమావేశాలు జరుగుతున్నప్పుడు అవసరమైతే కోవిడ్‌ పరీక్షలు సైతం నిర్వహిస్తామని స్పీకర్‌ చెప్పారు. రెండు షిఫ్టులలో ఉదయం, సాయంత్రం వర్షాకాల సమావేశాలు జరగనున్నట్టు ఆయన వెల్లడించారు. పార్లమెంటు భవనానికి లోక్‌సభ స్పీకర్‌ సంరక్షకుడు కాగా, ఈ భవనానికి లోక్‌సభ సెక్రటేరియట్‌ నోడల్‌ అథారిటీగా వ్యవహరిస్తుంది. కనుక పార్లమెంటులో అన్ని ఏర్పాట్లు చేసే బాధ్యత లోక్‌సభ సెక్రటేరియట్‌ మీదనే ఉంటుంది. కరోనాతో కాంగ్రెస్ ఎంపీ మృతి, తమిళనాడు కాంగ్రెస్‌ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, కన్యాకుమారి ఎంపీ వసంతకుమార్‌ మృతి పట్ల ప్రధాని మోదీ, కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ సంతాపం

కాగా సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 1 వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం వరకు లోక్‌సభ, అనంతరం మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాజ్యసభ సమావేశాలు జరుగుతాయి. ఈ మేరకు ఉమ్మడి సమావేశ హాల్‌లో ప్రత్యేకంగా సీటింగ్ ఏర్పాట్లు చేశారు. సమావేశాల కోసం గ్యాలరీలను కూడా వినియోగించుకోనున్నారు.

ఇదిలా ఉంటే సభలో సభ్యులకు ప్రశ్నించే హక్కు లేకుండా చేయొద్దని కాంగ్రెస్‌ లోక్‌సభాపక్ష నేత అధిర్‌ రంజన్‌ చౌధురి కోరారు. ప్రశ్నోత్తరాల సమయాన్ని, జీరో అవర్‌లను కుదించటం, ప్రత్యేకించి కోవిడ్‌ సంక్షోభ కాలంలో మంచిది కాదని ఛౌదరి స్పీకర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. రానున్న సమావేశాల్లో క్వశ్చన్‌ అవర్‌, జీరో అవర్‌ను రద్దు చేయనున్నట్టు వార్తలొస్తున్న నేపథ్యంలో ఆయనీ డిమాండ్‌ చేశారు.



సంబంధిత వార్తలు