New Delhi, August 29: దేశంలో శుక్రవారం తాజాగా మరో 76,472 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య34,63,973కు (COVID-19 in India) చేరుకుంది. గత 24 గంటల్లో 60,177 మంది కోలుకోగా 1,021 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 62,550కు (Coronavirus Deaths) చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ (Ministry of Health and Family Welfare) తెలిపింది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య26,48,999 కు చేరుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 7,52,424గా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 21.90గా ఉంది. కాగా యాక్టివ్ కేసుల కంటే కోలుకున్న కేసులు 18 లక్షలకు పైగా అధికంగా ఉన్నాయి.అంతేగాక యాక్టివ్ కేసుల కంటే 3.5 రెట్లు కోలుకున్న కేసులు ఉండటం శుభ పరిణామం.
దేశంలో కరోనా రికవరీ రేటు బుధవారానికి 76.28 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరణాల రేటు క్రమంగా తగ్గుతోందని ప్రస్తుతం 1.82 శాతానికి పడిపోయిందని తెలిపింది. ఆగస్టు 27 వరకు 3,94,77,848 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. గురువారం మరో 9,01,338 శాంపిళ్లను పరీక్షించినట్లు తెలిపింది. రోజుకు పది లక్షల పరీక్షలు జరిపే దిశగా దేశం పయనిస్తోందని తెలిపింది. గత రెండు వారాల్లోనే ఏకంగా కోటికి పైగా పరీక్షలు జరిపినట్లు వెల్లడించింది. ప్రతి పది లక్షల మందిలో 28,607 మందికి పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించింది. కరోనాకు బీపీ మందులతో చెక్, బ్లడ్ ప్రెషర్ రోగులకిచ్చే మందులు అద్భుతంగా పనిచేస్తున్నాయని లండన్ తాజా సర్వే ద్వారా వెల్లడి, కరోనా రోగుల శవ పరీక్షల్లో దిమ్మతిరిగే విషయాలు
దేశంలో కరోనా కేసులు అత్యధికంగా నమోదైన రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. ఆ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 7,47,995కి చేరింది. ఆగస్టు 4 నుంచి ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో కొత్త కేసులు భారత్‌లో నమోదవుతున్నాయి. దేశంలో యాక్టివ్ కేసుల శాతం 22గా ఉంది.
ప‌్రపంచంలో కరోనా కేసులలో మూడవ స్థానానికి చేరిన భారత్ ఇప్పుడు మృతుల పరంగా నాలుగో స్థానానికి చేరువయ్యింది. మెక్సికో మూడవ స్థానంలో ఉంది.అక్కడ కరోనాతో 62,594 మంది మృత్యువాత పడ్డారు. మరోవైపు భారతదేశంలో కరోనా మృతుల సంఖ్య 62,550గా ఉంది. ప్రస్తుతం కరోనా మృతుల విషయంలో అమెరికా మొదటి స్థానంలో ఉంది. అమెరికాలో కరోనా కారణంగా లక్షా 85 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. బ్రెజిల్ ప్రస్తుతం రెండవ స్థానంలో ఉంది. అక్కడ కరోనాతో ఇప్పటివరకు లక్షా 19 వేలకు పైగా జనం ప్రాణాలు కోల్పోయారు. పిల్లలకు, టీనేజర్లకు కరోనా ముప్పు ఎక్కువ
జూన్ నుంచి లాక్‌డౌన్ మినహాయింపులు ఇవ్వడంతో కొత్తగా కరోనా కేసుల నమోదుతోపాటు మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. మే నెలాఖరులో 10 లక్షల జనాభాకు మరణాల సంఖ్య ఐదుగా ఉన్న భారత్‌లో, ఇప్పుడు ఆ సంఖ్య 45కు చేరుకుంది. కాగా ప్రపంచంలోని పలు దేశాలలో ఇప్పుడు కొత్త కేసులు, కరోనా మరణాలు తగ్గుతున్నాయి.