Maharashtra Political Crisis: మహా రాజకీయాల్లో భారీ ట్విస్ట్, తన ఎమ్మెల్యేలతో ముంబైకి షిండే వర్గం, ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యంగా బీజేపీ పావులు, ప్రభుత్వాన్ని కాపాడుకునే దిశగా ఉద్ధవ్ టీం
మహారాష్ట్ర రాజకీయాలు రోజు రోజుకు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. తాజాగా తనతో పాటు ఉన్న 50 మంది ఎమ్మెల్యేలతో ముంబై వెళ్లనున్నట్లు (Will return to Mumbai soon) ఇవాళ శివసేన రెబల్ ఎమ్మెల్యే ఏక్‌నాథ్ షిండే తెలిపారు.
Mumbai, June 28: మహారాష్ట్ర రాజకీయాలు రోజు రోజుకు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. తాజాగా తనతో పాటు ఉన్న 50 మంది ఎమ్మెల్యేలతో ముంబై వెళ్లనున్నట్లు (Will return to Mumbai soon) ఇవాళ శివసేన రెబల్ ఎమ్మెల్యే ఏక్‌నాథ్ షిండే తెలిపారు. సీఎం ఉద్ధవ్ సర్కార్‌పై తిరుగుబాటు ప్రకటించిన తర్వాత (Maharashtra Political Crisis) తొలిసారి షిండే మీడియాతో మాట్లాడారు. త్వరలోనే ముంబై వెళ్తున్నాని, తమ అధికార ప్రతినిధిగా దీపక్ కేసార్కర్‌ను నియమించామని, ఆయనే అన్ని విషయాలను వివరించనున్నట్లు ఏక్‌నాథ్ తెలిపారు.
మంత్రి ఆదిత్య ఠాక్రే వ్యాఖ్యలకు ఏక్‌నాథ్ షిండే కౌంటర్ ఇచ్చారు. గౌహతి క్యాంప్‌లో ఎవరూ అసంతృప్తిగా లేరని ఏక్‌నాథ్ షిండే స్పష్టం చేశారు. తనతోపాటు 50 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని తెలిపారు. ఉద్దవ్ ఠాక్రేతో ఎంతమంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉంటే వారి పేర్లు బయటపెట్టాలని షిండే సవాల్ విసిరారు. మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్‌తోనూ మాట్లాడనున్నట్లు షిండే చెప్పారు. బాలాసాహెబ్ వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్తున్నామని, తనతో పాటు 50 మంది ఉన్నట్లు (50 MLAs are with us) ఆయన చెప్పారు.
ఇక మహారాష్ట్ర రాజకీయాలు ఢిల్లీకి చేరాయి. మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ఢిల్లీ చేరుకున్నారు. అక్కడ హోమంత్రి అమిషాతో ఫడ్నవీస్ భేటీ కానున్నారు. మరోవైపు శివసేన రెబెల్ ఎమ్మెల్యే ఏక్‌నాథ్ షిండే కూడా గౌహతి నుంచి ఢిల్లీ బయల్దేరారు. ఢిల్లీలో ఫడ్నవీస్, ఏక్‌నాథ్ షిండే భేటీ అయ్యే అవకాశముంది. అయితే రెబెల్స్‌తో కలిసి బీజేపీ మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నారనే చర్చ జరుగుతోంది. అదే విధంగా సీఎం ఉద్దవ్ ఠాక్రే మంగళవారం సాయంత్రం 5 గంటలకు కేబినెట్ మీటింగ్ ఏర్పాటు చేయనున్నారు. ఏదేమైనా నేడు ఢిల్లీలో జరిగే సమావేశం అత్యంత కీలకంగా మారనుంది.
ఇక రెబెల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే. 16 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలపై డిప్యూటీ స్పీకర్ అనర్హత వేటు వేయడంతోపాటు శివసేన శాసనసభాపక్ష నేతగా అజయ్ చౌదరిని నియమించడాన్ని సవాల్ చేస్తూ షిండే వర్గం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. అనర్హత పిటిషన్లపై జూలై 12 వరకూ ఎలాంటి చర్యలూ చేపట్టవద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. రెబల్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్‌పై మహారాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. శివసేన శాసనసభా పక్షనేత అజయ్ చౌదరితోపాటు డిప్యూటీ స్పీకర్, కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. అయిదు రోజుల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని మహా సర్కార్‌ను ఆదేశించింది. తదుపరి విచారణను జూలై 11కు వాయిదా వేసింది.
శివసేన రెబల్ ఎమ్మెల్ షిండే ఫోటోపై కోడిగుడ్లు విసిరిన కార్యకర్తలు, పోస్టర్‌పై ఇంక్ చల్లి నిరసన
సీఎం ఉద్దవ్‌పై షిండేతో పాటు రెబల్ ఎమ్మెల్యేలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. తాజాగా గవర్నర్ కోష్యారికి మరోసారి గువాహతి హోటల్‌లో ఉన్న ఏక్‌నాథ్ షిండే వర్గం ఎమ్మెల్యేలు బలనిరూపణ కోసం లేఖ రాయనున్నట్లు తెలుస్తోంది. ఫ్లోర్ టెస్ట్ నిర్వహించాలని షిండే వర్గం కోరే అవకాశం కనిపిస్తోంది. శివ సేన నుంచి బయటకు వచ్చిన తమకు 51 మంది ఎమ్మెల్యేల బలం ఉందని, బలనిరూపణకు అవకాశం ఇస్తేనే.. ముంబై తిరిగి వస్తామని శివసేన రెబల్ ఎమ్మెల్యేలు కోరే అవకాశం ఉందని సమాచారం.
ఈ పరిస్థితులు ఇలా ఉంటే గవర్నర్ చుట్టూరా రాజకీయం తిప్పాలనే ఆలోచనలో బీజేపీ, షిండే వర్గం ఉన్నట్లు తెలుస్తోంది. బలనిరూపణకు సిద్ధం కావాలని బీజేపీ, షిండే వర్గం భావిస్తుండగా.. ఆరోపణలు వెల్లువెత్తడంతో గవర్నర్ భగత్‌సింగ్ కొష్యారీ ప్రభుత్వానికి ఓ లేఖ రాశారు. ఈ మధ్య విడుదల చేసిన నిధులు, జీవోలపై వివరాలు అందజేయాలని లేఖలో కోరారు ఆయన. ప్రతిపక్ష నేత ప్రవీణ్ దరేకర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గవర్నర్ కొష్యారి ఈ లేఖ రాసినట్లు స్పష్టం అవుతోంది.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)