Maharashtra Politics: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవిస్, సీఎం పదవి నుంచి తప్పుకోవాలని షిండేకు హుకుం జారీ చేసిన బీజేపీ, కలకలం రేపుతున్న ఎన్సీపీ క్లైడ్ క్యాస్ట్రో ట్వీట్
సీఎం పదవి నుంచి తప్పుకోవాలని బీజేపీ షిండేకు హుకుం జారీ చేసిందని, దీంతో ఆయన మనస్తాపంతో మూడు రోజులు సెలవులు పెట్టి వెళ్లారని క్యాస్ట్రో ట్విట్టర్లో ట్వీట్ చేశారు.
Mumbai, April 25:మహారాష్ట్రకు త్వరలో కొత్త ముఖ్యమంత్రి రాబోతున్నారని ఎన్సీపీ అధికార ప్రతినిధి క్లైడ్ క్యాస్ట్రో చేసిన వ్యాఖ్యలు మహా రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. సీఎం పదవి నుంచి తప్పుకోవాలని బీజేపీ షిండేకు హుకుం జారీ చేసిందని, దీంతో ఆయన మనస్తాపంతో మూడు రోజులు సెలవులు పెట్టి వెళ్లారని క్యాస్ట్రో ట్విట్టర్లో ట్వీట్ చేశారు.
మీడియా వర్గాలు తనకు ఈ విషయపై కచ్చితమైన సమాచారం అందించాయని పేర్కొన్నారు. సీఎం షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌లు తమ బాధ్యతలు మార్చుకోవాలని బీజేపీ చెప్పిందని క్యాస్ట్రో తెలిపారు. త్వరతో ఫడ్నవీస్ సీఎంగా బాధ్యతలు చేపడతారని, షిండే డిప్యూటీ సీఎం పదవికి పరిమితం అవుతారని చెప్పుకొచ్చారు.
Here's Clyde Crasto Tweet
క్యాస్ట్రో ట్వీట్ లో ఏముందంటే..:'ఇది నిజమేనా? షిండే, ఫడ్నవీస్ తమ పదవులు మార్చుకోబోతున్నారని మీడియా వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయం గురించి ఢిల్లీలో మీటింగ్ కూడా జరిగిందట. బీజేపీ పదవి మార్చుకోమని తనకు చెప్పడం ఇష్టం లేకే షిండే మూడు రోజులు సెలవు పెట్టి వెళ్లారా?' అని క్యాస్ట్రో ట్వీట్ చేశారు.