No Pension for MLAs Who Defect: పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఇకపై నో పెన్సన్, కీలక బిల్లును తీసుకువచ్చిన హిమాచల్ ప్రభుత్వం, సభలో చర్చ అనంతరం బిల్లు ఆమోదం
పార్టీలు మారిన ఎమ్మెల్యేలకు పెన్షన్ (Pension Cut) సదుపాయాన్ని నిలిపివేస్తూ బిల్లును తీసుకువచ్చింది.
Shimla, Sep 4: ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై హిమాచల్‌ప్రదేశ్ (Himachal Pradesh)లోని కాంగ్రెస్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పార్టీలు మారిన ఎమ్మెల్యేలకు పెన్షన్ (Pension Cut) సదుపాయాన్ని నిలిపివేస్తూ బిల్లును తీసుకువచ్చింది. దీనికి సంబంధించిను సవరణ బిల్లుకు రాష్ట్ర శాసనసభ బుధవారం ఆమోదం (Himachal Assembly Passes Bill) తెలిపింది. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటును ఎదుర్కొన్న ఎమ్మెల్యేలకు ఈ కొత్త నిబంధన వర్తించనుంది. వీడియో ఇదిగో, సింగపూర్‌లో డోలు వాయించిన ప్రధాని నరేంద్ర మోదీ, అన్నయ్యా అంటూ రాఖీ కట్టిన మహిళ
ఫిరాయింపులను అరికట్టేందుకు హిమాచల్‌ప్రదేశ్ శాసనసభ (సభ్యుల పింఛన్లు, అలవెన్సులు) సవరణ బిల్లు - 2024ను రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు (Sukhvinder Singh Sukhu) మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. చర్చ అనంతరం ఓటింగ్ నిర్వహించి ఈ బిల్లును శాసనసభ ఆమోదించింది. ‘‘ఏదైనా ఒక సమయంలో ఫిరాయింపు నిరోధక చట్టం కింద అనర్హత వేటును ఎదుర్కొన్న శాసనసభ్యులు ఇకపై పింఛను పొందే వెసులుబాటు ఉండదు’’ అని ఈ బిల్లులో పేర్కొన్నారు.
Here's Video
హిమాచల్‌ప్రదేశ్ చట్టాల ప్రకారం.. ప్రస్తుతం ఐదేళ్ల కాలం పాటు ఎమ్మెల్యేగా పనిచేసిన శాసనసభ్యులకు (MLAs) నెలకు రూ.36వేల పింఛను ఇస్తున్నారు. ఐదేళ్లకు మించి పదవీకాలం ఉన్న ఎమ్మెల్యేలకు ప్రతి ఏడాదికి రూ.వెయ్యి చొప్పున అదనంగా పెన్షన్ అందజేస్తున్నారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన రాజ్యసభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ (Congress)కు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు బీజేపీ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేశారు. ఆ తర్వాత బడ్జెట్ సమావేశాల సమయంలోనూ పార్టీ విప్‌ను కాదని వీరు సభలకు హాజరుకాలేదు. దీంతో పార్టీ ఫిరాయింపుల చట్టం కింద వారిపై అనర్హత వేటు పడింది. అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో వీరిలో ఇద్దరు మళ్లీ విజయం సాధించి సభలో అడుగుపెట్టారు. మిగతా నలుగురు ఓటమిపాలయ్యారు.