ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) నేడు బ్రూనై పర్యటనను ముగించుకొని సింగపూర్‌ (Singapore) వెళ్లారు. సింగపూర్‌ ఎయిర్‌పోర్ట్‌లో మోదీకి ఘన స్వాగతం లభించింది. ప్రవాస భారతీయులు మోదీకి గ్రాండ్‌ వెల్‌కమ్‌ పలికారు. మోదీకి ఓ మహిళ రాఖీ కూడా కట్టింది. ఈ సందర్భంగా అక్కడ బస చేస్తున్న హోటల్‌ వద్ద మోదీ ఢోలు (dhol) వాయించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. జమ్మూ కశ్మీర్‌లో మొత్తం 90 స్థానాలకు మూడు విడతల్లో పోలింగ్‌, కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించిన తర్వాత తొలిసారి ఎన్నికలు

మోదీ బ్రూనై, సింగపూర్‌ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధానికి 40 ఏళ్లయిన సందర్భంగా మోదీ ఈ పర్యటన చేపట్టిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో ఇరు దేశాల మధ్య పలు కీలక ఒప్పందాలు జరిగినట్లు భారత విదేశాంగ శాఖ అధికారులు వెల్లడించారు. రెండు దేశాల మధ్య త్వరలోనే నేరుగా విమాన సర్వీసులను ప్రారంభించేందుకు అంగీకారం కుదిరినట్లు తెలిపారు. ఈ ఏడాది చివరి నాటికి చెన్నై నుంచి బ్రూనై రాజధానికి విమాన సర్వీసులు ప్రారంభించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు పేర్కొన్నారు.

Here's Videos

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)