No Role For Third Party Mediation: కాశ్మీర్‌పై జోక్యం చేసుకోవద్దు, ఐరాస ప్రధాన కార్యదర్శికి భారత్ ఘాటు హెచ్చరిక, అక్కడ ఉగ్రమూకను ఖాళీ చేయించండి, తేల్చి చెప్పిన భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రవీష్ కుమార్

తమ దేశ అంతర్గత వ్యవహారాల్లో ఇతర దేశాల జోక్యంపై భారత్ కొంచెం ఘాటుగా స్పందిస్తోంది. ఇందులో భాగంగా జమ్ముకశ్మీర్‌పై (Jammu and Kashmir) ఐక్యరాజ్యసమితి (ఐరాస) ప్రధాన కార్యదర్శి ఆంటోనియా గుటెర్స్‌ (General António Guterres) చేసిన ప్రతిపాదనను భారత్‌ (India) తోసిపుచ్చింది. కశ్మీర్‌పై మధ్యవర్తిత్వానికి భారత్ సిద్ధంగా లేదని, పొరుగుదేశం బలవంతంగా, అక్రమంగా ఆక్రమించిన ప్రాంతాల నుంచి ఖాళీ చేసే విషయం మీద ముందు ఐక్యరాజ్యసమితి దృష్టిసారించాలని కోరింది.

No Role For Third Party Mediation India rejects UN chiefs mediation offer on Kashmir (photo-PTI)

New Delhi, Febuary 17: తమ దేశ అంతర్గత వ్యవహారాల్లో ఇతర దేశాల జోక్యంపై భారత్ కొంచెం ఘాటుగా స్పందిస్తోంది. ఇందులో భాగంగా జమ్ముకశ్మీర్‌పై (Jammu and Kashmir) ఐక్యరాజ్యసమితి (ఐరాస) ప్రధాన కార్యదర్శి ఆంటోనియా గుటెర్స్‌ (General António Guterres) చేసిన ప్రతిపాదనను భారత్‌ (India) తోసిపుచ్చింది. కశ్మీర్‌పై మధ్యవర్తిత్వానికి భారత్ సిద్ధంగా లేదని, పొరుగుదేశం బలవంతంగా, అక్రమంగా ఆక్రమించిన ప్రాంతాల నుంచి ఖాళీ చేసే విషయం మీద ముందు ఐక్యరాజ్యసమితి దృష్టిసారించాలని కోరింది.

పార్లమెంట్ ఓకే అంటే పీఓకే మనదే

జమ్ము కశ్మీర్‌లో పరిణామాలపై తాను తీవ్రంగా కలత చెందానని, ఇరు దేశాలు అంగీకరిస్తే కశ్మీర్‌పై మధ్యవర్తిత్వానికి తాను సిద్ధమని ఐరాస చీఫ్‌) (UN Secretary General గుటెర్స్‌ పాక్‌ పర్యటన సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై భారత్‌ ఈ మేరకు స్పందించింది.

జమ్ముకశ్మీర్‌పై తమ విధానంలో ఎలాంటి మార్పూ లేదని, కశ్మీర్‌ భారత్‌ అంతర్భాగమని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రవీష్‌ కుమార్‌ (Raveesh Kumar) స్పష్టం చేశారు. ఈ అంశంలో ద్వైపాక్షిక సంప్రదింపులు మినహా మరెవరి జోక్యానికీ తావు లేదని తేల్చిచెప్పారు. భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్తాన్‌ ప్రోత్సహిస్తున్న సీమాంతర ఉగ్రవాదం నిర్మూలించే దిశగా ఐరాస దృష్టిసారించాలని కోరారు.

ఆర్మీలో మహిళలకు శాశ్వత కమిషన్ హోదా ఇవ్వాల్సిందే

ఇదిలా ఉంటే దాయాది దేశం కాశ్మీర్ అంశాన్ని అవకాశం చిక్కినప్పుడల్లా పాకిస్తాన్ (Pakistan) అంతర్జాతీయ దృష్టికి తీసుకువస్తోంది. ఇందులో భాగంగా గత నెలలో భద్రతామండలిలో కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తింది. అయితే అక్కడ పాకిస్తాన్ కు ఎవరూ సపోర్ట్ గా రాకపోవడంతో తీవ్ర అవమానాన్ని ఎదుర్కుంది. చైనా తప్ప మిగతా దేశాలేవి దానికి మద్దతుగా నిలవలేదు. కాగా సీమాంతర ఉగ్రవాదాన్ని అణిచివేసేందుకు అన్ని దేశాలు కలిసి రావాలని భారత్ ప్రధాని మోడీ అంతర్జాతీయ వేదికలనుంచి పిలుపునిస్తూనే వున్నారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now