Women in Armed Forces (Photo Credits: PTI)

New Delhi, February 17: ఇండియన్ ఆర్మీలో (Indian Army) కమాండ్‌ పాత్రలో (Command Roles) మహిళా అధికారులు బాధ్యతలపై సుప్రీంకోర్టు (Supreme Court) చారిత్రాత్మక తీర్పును వెల్లడించింది. ఆర్మీలో మహిళలకు శాశ్వత కమిషన్‌ హోదా ఇవ్వాలని, మహిళా అధికారులు కమాండ్‌ పోస్టింగ్‌కూ అర్హులని దేశ అత్యున్న న్యాయస్ధానం కీలక తీర్పును వెలువరించింది.

ఇండియన్ ఆర్మీ సాహసోపేత ఆపరేషన్

సర్వీసులో ఎంతకాలం ఉన్నారనే దానితో సంబంధం లేకుండా మహిళా అధికారులందరికీ శాశ్వత కమిషన్‌ హోదా (Permanent Commission Role) వర్తిస్తుందని ఈ తీర్పులో స్పష్టం చేసింది.

పీవోకేలోని ఉగ్రవాద స్థావరాలపై భారత ఆర్మీ మెరుపుదాడి

ఢిల్లీ హైకోర్టు (Delhi Highcourt) నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు స్పందిస్తూ ఆర్మీలో మహిళా అధికారులందరికీ మూడునెలల్లోగా శాశ్వత కమిషన్‌ హోదాను మంజూరు చేయాలని ఆదేశించింది.

Take a Look at the tweets:

విచారణ సందర్భంగా పర్మినెంట్‌ కమిషన్‌పై కేంద్రం తన స్పందనను తెలియజేసింది. మహిళా అధికారులను అంగీకరించడానికి సైన్యంలోని పురుషులు సంసిద్ధంగా లేరు. యుద్ధ ఖైదీలుగా తీసుకునే ప్రమాదం ఉంది.

సీఏఏ, ఆర్టికల్ 370పై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు

సైన్యంలోని పురుషుల్లో ఎక్కువమంది మహిళా అధికారులను కమాండోగా అంగీకరించడానికి మానసికంగా సిద్ధంగాలేరు. అదేవిధంగా వివిధ శారీరక ప్రమాణాల ఆధారంగా పోస్టింగ్‌ విషయంలో స్త్రీ, పురుషులను సమానంగా చూడలేమంది. ఈ విషయంలో పరిమితులున్నాయని పేర్కొంటూ ఆర్మీ కమాండో పోస్టులకు మహిళలు తగినవారు కాదని వివరించింది.

Take a Look at the tweet:

ఈ వాదనల అనంతరం సర్వోన్నత న్యాయస్థానం తన తీర్పును వెల్లడిస్తూ.. ఆర్మీలోని మహిళ అధికారులు కమాండింగ్‌ పదవులకు (Women in Armed Forces) అర్హులేనని పేర్కొంది. పురుష అధికారులతో సమానంగా కమాండింగ్‌ స్థానాలను మహిళా అధికారులు పొందవచ్చని తెలిపింది. ఇందుకు సంబంధించిన మార్పులను మూడు నెలల్లో అమలు పరచాలని ఆదేశించింది. ప్రభుత్వ వాదనలు వివక్షాపూరితంగా, కలతపెట్టేవిగా అంతేకాకుండా ఓ మూస ధోరణిలో ఉన్నాయంది. స్త్రీ, పురుషుల మధ్య ఆర్మీ వివక్ష చూపించొద్దని సుప్రీంకోర్టు పేర్కొంది.

దేశంలో ఎక్కడనుంచైనా మీరు ఓటు వేయవచ్చు

పురుషుల మాదిరే మహిళా అధికారుల నియామక నిబంధనలు ఒకేలా ఉండాలని తేల్చిచెప్పింది. శారీరక లక్షణాలను కారణంగా చూపుతూ వారికి శాశ్వత కమిషన్‌ హోదా నిరాకరించడాన్ని కోర్టు తప్పుపడుతూ లింగ అసమానత్వపు ధోరణిని కేంద్రం విడనాడాలని హితవు పలికింది.

జేమ్స్‌బాండ్ సినిమాల్లో లాగా గన్స్ పట్టుకుని తిరగరు

మహిళల శారీరక లక్షణాలతో వారి సామర్ధ్యాన్ని అంచనావేయడం మహిళలకు, సైన్యానికీ అవమానకరమని జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని బెంచ్‌ ఆందోళన వ్యక్తం చేసింది. మహిళా అధికారులను కమాండ్‌ పోస్టులకు నిరాకరించడం పక్షపాతపూరిత నిర్ణయమని, సమానత్వ హక్కుకు విరుద్ధమని స్పష్టం చేసింది.

పార్లమెంట్ ఓకే అంటే పీఓకే మనదే

ఈ తీర్పును స్వాగతిస్తున్నామని, ఇదొక చారిత్రాత్మక తీర్పు అని ఇండియన్ ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్ సీమా సింగ్ తెలిపారు. మహిళలు పురుషులతో పాటే సమాన అవకాశాలను అందిపుచ్చుకునేందుకు దారులు ఏర్పడ్డాయని అన్నారు.