New Voting Technology: దేశంలో ఎక్కడనుంచైనా మీరు ఓటు వేయవచ్చు, పోలింగ్ బూత్‌కు వెళ్లనవసరం లేకుండా కొత్త టెక్నాలజీ, ఐటీ-ఎంతో చేతులు కలిపిన ఈసీ
Election Commission developing new voting technology with IIT-M! things you should know | (Photo-PTI)

New Delhi, Febuary 17: మీరు త్వరలో అందుబాటులోకి రానున్న టెక్నాలజీ ద్వారా నిర్దేశిత పోలింగ్‌ బూత్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఎన్నికల్లో ఓటు వేయవచ్చు. ఇందుకోసం సరికొత్త టెక్నాలజీ (New Voting Technology) అభివృద్ధి చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) కసరత్తు చేస్తున్నది.

ట్విట్టర్‌ని షేక్ చేస్తోన్న మినీ మఫ్లర్ మ్యాన్

దీనిలో భాగంగా ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ- మద్రాస్‌ (IIT-M)తో చేతులు కలిపింది. అయితే ఈ ప్రాజెక్ట్‌ ఇంకా అభివృద్ధి దశలో ఉంది. అయితే ఈ అవకాశాన్ని ఉపయోగించుకునేందుకు ఓటర్లు ముందుగానే తమ రిటర్నింగ్‌ అధికారికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

‘బ్లాక్‌ చైన్‌' టెక్నాలజీతో ముడిపడిన ఈ ప్రాజెక్టు గురించి సీనియర్‌ డిప్యూటీ ఎన్నికల కమిషనర్‌ సందీప్‌ సక్సేనా (Sandeep Saxena) వివరణ ఇచ్చారు. వైట్‌ లిస్టెడ్‌ ఐపీ డివైజ్‌లు, ప్రామాణిక ఇంటర్నెట్‌ లైన్లు, బయోమెట్రిక్‌ యంత్రాలు, వెబ్‌ కెమెరాతో కూడిన టూ-వే ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ పద్ధతిలో ఇది ముడిపడిందని ఆయన అన్నారు.

ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలంటే ఓటర్లు ముందుగా నిర్ణయించిన సమయానికి నిర్దేశిత వేదికకు చేరుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ఇది ‘ఓట్‌ ఫ్రమ్‌ హోం’ కాదని చెప్పారు. ‘ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ డివైజ్‌ నుంచైనా’ ఓటు వేసేందుకు మరింత సమయం, అధునాతన సాంకేతికత అవసరం అని ఆయన పేర్కొన్నారు.

మూడోసారి ఢిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అరవింద్ కేజ్రీవాల్

ఈ సరికొత్త ఓటింగ్‌ పద్ధతి ఇంకా అభివృద్ధి దశలో ఉందని ఈ సాంకేతికత ‘ఓకే’ అని నిర్ధారణ అయిన తర్వాతే సంబంధిత భాగస్వామ్య పక్షాలతో సంప్రదింపుల ప్రక్రియ, ఎన్నికల చట్టాలు, నిబంధనల్లో మార్పుల ప్రక్రియ మొదలవుతుందని చెప్పారు. ఎన్నికల సమయంలో స్వస్థలాలకు వెళ్లి ఓటేసే స్థోమత లేని వలస కార్మికులకు వారు పనిచేస్తున్న నగరం/పట్టణం నుంచే ఓటు వేసే సదుపాయాన్ని కల్పించాలని వివిధ రాజకీయపార్టీలు ఎప్పటి నుంచో ఎన్నికల సంఘాన్ని డిమాండ్‌ చేస్తున్నాయి.

ఢిల్లీని గెలిచిన జోష్ లవర్ బాయ్‌గా మారిన అర్వింద్ కేజ్రీవాల్

ఎలా పనిచేస్తుంది?

ఈ ‘టూవే బ్లాక్‌ చెయిన్‌ రిమోట్‌ ఓటింగ్‌' పద్ధతిలో ఈసీకి చెందిన ‘ఎలక్టోలర్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీసర్‌ నెట్‌వర్క్‌ (ఈఆర్‌వో నెట్‌)’ ద్వారా బయోమెట్రిక్స్‌, వెబ్‌ కెమెరాలను ఉపయోగించి ఓటర్‌ గుర్తింపు జరుగుతుంది. గుర్తింపు పూర్తయిన తర్వాత బ్లాక్‌ చైన్‌ ఎనేబుల్డ్‌ ఈ-బ్యాలెట్‌ పేపర్‌ (స్మార్ట్‌ కాంట్రాక్ట్‌) జనరేట్‌ అవుతుంది.

దేశంలో ఇప్పటివరకు హ్యాట్రిక్ ముఖ్యమంత్రులు వీరే

దాని ద్వారా ఓటు వేసిన అనంతరం బ్యాలెట్‌ ఎన్‌క్రిప్ట్‌ అయి, బ్లాక్‌ చైన్‌ హ్యాష్‌ట్యాగ్‌ జనరేట్‌ అవుతుంది. ఆ తర్వాత ఈ హ్యాష్‌ట్యాగ్‌ నోటిఫికేషన్‌ను సంబంధిత భాగస్వామ్య పక్షాలకు (అభ్యర్థులు, రాజకీయ పార్టీలు) పంపడం జరుగుతుంది. ఈ ఎన్‌క్రిప్టెడ్‌ ఓట్లను ఎవరైనా డీక్రిప్ట్‌ చేశారా లేదా ట్యాంపర్‌ చేశారా అన్నది నిర్ధారించేందుకు ఓట్ల కౌంటింగ్‌కు ముందు మరోసారి వాటిని పరిశీలిస్తారు.