Delhi Assembly Election Results 2020 Twitter in love with Aam Aadmi Party's Mini Mufflerman (photo-AAP Twitter Page)

New Delhi, Febuary 11: ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ( Delhi Assembly Elections 2020) ఢిల్లీ ఓటర్లు స్పష్టమైన తీర్పును ఇచ్చారు. నువ్వే నేనా అంటూ సాగినా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఏకపక్షంగా మారాయి. ఆమ్ ఆద్మీ పార్టీకి ఢిల్లీ ఓటర్లు స్పష్టమైన మెజార్టీని అందించారు. ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) (Aam Aadmi Party (AAP) తమ విజయాన్ని ముందుగానే సెలబ్రేట్‌ చేసుకుంటోంది.

స్మైలీ ఫేస్ ఎమోజీతో మఫ్లర్‌మాన్‌ (Mufflerman) పేరుతో ఒక బుడతడి ఫోటోను షేర్‌ చేసింది. ఆప్‌ ట్రేడ్‌ మార్క్‌ మఫ్లర్‌, టోపీ ధరించి, అచ్చం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌లా (Delhi Chief Minister Arvind Kejriwal) వున్న ఆ బుడతడి ఫోటోను ట్విటర్‌లో షేర్‌ చేసింది.

ఈ ఫోటో వైరల్ అవుతోంది. అభిమానులు లైక్‌లతో పాటు కామెంట్లు, షేర్లతో ఆ ఫోటోని వైరల్ చేస్తున్నారు. ఆప్‌ షేర్‌ చేసిన మినీ మఫ్లర్‌ మాన్‌ (Mini Mufflerman) ఫోటో ట్విట్టర్ ని షేక్ చేస్లోంది.

Here's AAP Tweet

మొత్తం 70 స్థానాలు ఉన్న ఢిల్లీలో ఆప్ (AAP) ఇప్పటికే 62 స్థానాల్లో ఆధిక్యతతో దూసుకుపోతోంది. కేవలం 8 స్థానాల్లో మాత్రమే బీజేపీ ఆధిక్యంలో ఉంది. దీంతో హావాతో పార్టీ కార్యకర్తలు సంతోషంగా ఉబ్బి తబ్బిబ్బు అవుతున్నారు. హ్యాట్రిక్ కొట్టిన ఆప్ పార్టీ ఢిల్లీ పీఠాన్ని మరోసారి కైవసం చేసుకోవటం తథ్యం అనే విషయం తెలిసిందే.

ఎమ్మెల్యే అంటే అతడే, పురిటినొప్పులతో బాధపడుతున్న గర్భిణీని ఆరు కిలో మీటర్లు మోశాడు

దీంతో కాంగ్రెస్, బీజేపీ వంటి జాతీయ పార్టీలను చీపురుతో ఊడ్చేసి పడేసినట్లైంది. ముచ్చటగా మూడోసారి హస్తినలో అధికారాన్ని చేజిక్కించుకుంది. ఈ సంచలన విజయాన్ని ఆమాద్మీ శ్రేణులు ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాయి. ఆమాద్మీ కార్యాలయంతో పాటు కేజ్రీవాల్ నివాసంలో సంబరాలు మిన్నంటాయి.

ప్రధానంగా "నేను కేజ్రీవాల్...కానీ నేను ఉగ్రవాదిని కాదు’ అని ఒక యూజర్‌ వ్యాఖ్యానించగా, మరో యూజర్‌ ఆప్‌కు ఓట్లు వేసిన ఢిల్లీ ఓటర్లందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఇది భారతదేశం ఆత్మను, సారాన్ని రక్షించడానికి ప్రజల స్పష్టమైన తీర్పు అని, విద్య, ఆరోగ్య సంరక్షణకు వేసిన ఓటు. హిందుస్తాన్‌, పాకిస్తాన్‌ కోసం కాదు..స్థిరత్వం కోసం ఢిల్లీ ప్రజలు ఓటు వేశారని మరోకరు వ్యాఖ్యానించారు.

ఏదో ఒకరోజు అతనే సీఎం అని మరొకరు పోస్ట్‌ చేశారు.

ఏదో ఒకరోజు అతనే సీఎం

ఇదిలా ఉంటే నేడు అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత పుట్టిన రోజు. దీంతో అరవింద్ కేజ్రీవాల్ కి ఒకేసారి రెండు పండగలు వచ్చినట్లయింది. పార్టీ ఘన విజయం దిశగా దూసుకుపోతుండటంతో భార్య సునీత బర్త్ డే కేక్ కట్ చేయించి ఘనంగా సంబరాలు జరుపుకున్నారు.

Here's ANI Tweet

ఈ ఎన్నికల్లో గెలుపుతో భార్యకు కేజ్రీవాల్ అదిరిపోయే బర్త్ డే గిఫ్ట్ ఇచ్చినట్లయింది. ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ విజయోత్సవ వేడుకలతో పాటు సునీత బర్త్ డే వేడుకలు ఒకేసారి జరిగాయి. కేజ్రీవాల్ కేక్ కట్ చేసి.. భార్యకు తినిపించారు.