Delhi Election Result 2020 One CM seat, 21 centres and 2,600 staff: EC gears up for counting day

New Delhi, Febuary 11: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ (Delhi Assembly Elections 2020) మొదలైంది. మొత్తం 70 శాసనసభ స్థానాలకు నేడు కౌంటింగ్ జరుగుతోంది. ఉదయం 8 గంటలకు నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమయింది. కౌంటింగ్‌కు సంబంధించి మొత్తం 21 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లుగా ఢిల్లీ ఎన్నిలక ప్రధాన అధికారి రణ్‌బీర్ సింగ్ తెలిపారు.

ఇప్పటికే ఈవీఎం సహా కౌంటింగ్‌కు సంబంధించిన సామాగ్రి కౌంటింగ్ సెంటర్లకు చేరింది.ఒక్కొక్క కౌంటింగ్ కేంద్రం మొత్తం 10 నుంచి 14 టేబుల్స్‌ను ఏర్పాటు చేశారు.

చీపురు కమలాన్ని ఊడ్చి పారేయనుందా..,

నాలుగు చోట్ల కౌంటింగ్ జరుగుతోంది. ముందుగా బ్యాలెట్ పేపర్ ఓట్లను లెక్కింపు. ఆ తరువాత EVM ఓట్లు లెక్కింపు జరుగుతుంది. తూర్పు జిల్లా అక్షర్ధామ్‌, షహదారా జిల్లా ఐటిఐ నంద్ నగ్రిలోని స్ట్రాంగ్ రూమ్‌లలో ఈవీఎంలను భద్రపరిచారు.

ఆప్ పార్టీ  మేనిఫెస్టో

అయితే కొన్ని ప్రాంతాల్లో సరైన స్థలం లేకపోవడం వల్ల, కొత్తగా నిర్మించిన భవనాల్లో, ప్రభుత్వ విద్యాసంస్థల్లో కూడా ఈవీఎంలను భద్రపరిచారు. ఈవీఎంలను భద్రపరిచిన ప్రాంతాల్లో ఢిల్ల్లీ పోలీసులే కాకుండా, పారామిలిటరీ దళాలతో భద్రతను ఏర్పాటు చేశారు.

నీ పని నీవు చూసుకో, మోదీ మా దేశ ప్రధాని

ఎన్నికల సంఘం అధికారులు మరియు పోలింగ్ ఏజెంట్లను మాత్రమే కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతించారు అభ్యర్థులు, పార్టీ కార్యకర్తలు కౌంటింగ్ కేంద్రాల వెలుపలే ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు.

ఢిల్లీ ప్రజలకు వరాల జల్లులు కురిపించిన భారతీయ జనతా పార్టీ

ఢిల్లీలో (Delhi) మొత్తం 70 స్థానాలకు ఎన్నికల బరిలో మొత్తం 672 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో 58 జనరల్, 12 ఎస్సీ అభ్యర్థులకు కేటాయించారు. సీఎం కేజ్రీవాల్ (CM Kejriwal) పోటిచేస్తున్న న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానానికి 26 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. ఈ సీటు ఉత్కంఠభరితంగా మారింది.

ఢిల్లీ ఎన్నికల కోసం మేనిఫెస్టోని విడుదల చేసిన కాంగ్రెస్

దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. మెజారిటీ సర్వేలు ఆప్‌కే జై కొట్టాయి.

కాగా 2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 67 స్థానాల్లో గెలుపొంది చరిత్ర సృష్టించింది. బీజేపీ మూడు సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ ఖాతా తెరవలేదు. గతంలో వరుసగా మూడుసార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ఈ సారి కూడా ఖాతా తెరవడం అనుమానమేనని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి.