New Delhi, Febuary 11: దేశ రాజకీయాల్లో ఒకసారి గెలవడం అంటే చాలా కష్టం..మరీ రెండవ సారి గెలవడమంటే అతని మీద ప్రజలకు నమ్మకం ఉండాలి. తోడు నీడగా ఉండి మంచి పరిపాలన అందిస్తాడనే భరోసాను ఇవ్వగలగాలి. మరి అలాంటి వారు దేశంలో ఎవరైనా ఉన్నారా..అంటే ఉన్నారనే సమాధానం వస్తోంది.
వరుసగా మూడు సార్లు ముఖ్యమంత్రిగా (Hat-Trick CMs In India) గెలిచి ప్రజల మనసు దోచుకున్న ముఖ్యమంత్రులు చాలా మందే ఉన్నారు. వారి వరసలో తాజాగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) చేరారు.
ఢిల్లీ ఎన్నికల్లో (Delhi Assembly Elections 2020) వరుసగా మూడు సార్లు గెలిచి సంచలనాన్ని నమోదు చేశారు. హ్యాట్రిక్ ముఖ్యమంత్రుల (Hat-Trick Chief ministers) డేటాను ఓ సారి పరిశీలిస్తే.. వారిలో జ్యోతి బసు, పవన్ కుమార్ చామ్లింగ్, మోహన్ లాల్ సుకాడియా, గోవింద్ బల్లబ్ పంత్, మానిక్ సర్కార్, శివరాజ్ సింగ్ చౌహాన్, రమణ్ సింగ్, ఒక్రమ్ ఇబోబి సింగ్, ప్రధాని నరేంద్ర మోదీ, తరుణ్ గోగోయ్, షీలా దీక్షత్, వసంతరావ్ నాయక్, కే కామ్‌రాజ్, బిమల ప్రసాద్ ఛలిహా, నవీన్ పట్నాయక్, ఇప్పుడు కేజ్రివాల్ వంటి వారెందరో ఉన్నారు.
జ్యోతిబసు
దేశంలోనే అత్యధిక కాలం సీఎంగా పనిచేసిన కమ్యూనిస్టు నేతగా జ్యోతిబసు రికార్డును సొంతం చేసుకున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా వరుసగా ఐదుసార్లు పనిచేశారు. బెంగాల్‌లో సీపీఎం నేతృత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్ నుంచి 1977 నుంచి 2000 వరకు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు.
ఎమ్మెల్యే అంటే అతడే, పురిటినొప్పులతో బాధపడుతున్న గర్భిణీని ఆరు కిలో మీటర్లు మోశాడు
పవన్‌కుమార్ చామ్లింగ్:
సిక్కీం ముఖ్యమంత్రిగా వరుసగా అయిదు సార్లు పనిచేసిన ఘనత చామ్లింగ్‌దే. తాను స్థాపించిన సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ తరఫున 1994 నుంచి 2014 వరకు సుదీర్ఘ కాలం పాటు పవన్ కుమార్ చామ్లింగ్ సీఎంగా ఎన్నికయ్యారు. 1994, 1999, 2004, 2009, 2014.. అయిదు ఎన్నికల్లోనూ ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు.
ఆరు నెలల పాలనను పూర్తి చేసుకున్న ఏపీ సీఎం వైయస్ జగన్
మోహన్ లాల్ సుకాడియా
రాజస్థాన్ నుంచి వరుసగా నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1954 నుంచి 1971 వరకు ఆయన సీఎంగా ఉన్నారు.
గోవింద్ బల్లబ్ పంత్
ఉత్తర ప్రదేశ్ నుంచి నాలుగు సార్లు సీఎంగా ఎన్నికయ్యారు. 1937 నుంచి 1954 వరకు కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా పనిచేశారు.
మహారాష్ట్రలో కొలువుదీరిన శివసేన ప్రభుత్వం
మానిక్ సర్కార్
త్రిపుర నుంచి కమ్యూనిస్ట్ పార్టీ తరపున 4 సార్లు సీఎంగా గెలిచారు. 1998 నుంచి 2018 వరకు వరుసగా నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు.
శివరాజ్ సింగ్ చౌహాన్
మధ్యప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ నుంచి శివరాజ్ సింగ్ చౌహాన్ వరుసగా మూడు సార్లు గెలిచారు. 2005 నుంచి 2018 వరకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు.
నవీన్ పట్నాయక్:
ఒడిశా ముఖ్యమంత్రిగా నవీన్ పట్నాయక్ వరుస విజయాలతో ఉన్నారు. తన తండ్రి, ఒడిశా మాజీ సీఎం బిజూ పట్నాయక్ వారసత్వాన్ని అందుపుచ్చుకొని జనతాదళ్ నుంచి బయటకువచ్చి తనతండ్రి పేరుతో బిజూ జనతాదళ్‌ను స్థాపించారు. వరుసగా ఐదు సార్లు ముఖ్యమంత్రిగా గెలిచారు.
రమణ సింగ్:
ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిగా మూడు సార్లు పనిచేశారు రమణ్ సింగ్. 2003 నుంచి 2018 వరకు 15 ఏళ్ల పాటు పనిచేశారు. ఛత్తీస్‌గఢ్‌కు రెండో ముఖ్యమంత్రిగా అయిన ఆయన బీజేపీ ఉపాధ్యక్షునిగా కూడా పనిచేశారు.
ఎన్నికలు ఏవైనా తెలంగాణలో గెలుపు టీఆర్ఎస్‌దే
ఒక్రమ్ ఇబోబి సింగ్
కాంగ్రెస్ పార్టీ నుంచి మణిపూర్ సీఎంగా మూడు సార్లు పనిచేశారు. 2002 నుంచి 2017 వరకు ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగారు.
నరేంద్ర మోదీ:
వరుసగా దేశానికి రెండు సార్లు ప్రధాని అయిన నరేంద్ర మోదీ, అంతకుముందు గుజరాత్ ముఖ్యమంత్రిగా మూడు సార్లు పనిచేశారు. 2002, 2007, 2012 ఎన్నికల్లో గెలిచిన మోడీ మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. తర్వాతి కాలంలో బీజేపీ తరపున ప్రధాని అభ్యర్ధిగా మారి రెండు సార్లు ప్రధాని అయ్యారు.
అరుణాచల ప్రదేశ్ సీఎం సాహస రైడ్
తరుణ్ గొగొయి:
తరుణ్ గోగోయ్ కాంగ్రెస్ పార్టీ నుంచి అసోంలో మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు.. 2001 నుంచి 2016 వరకు పూర్తిస్థాయి సీఎంగా పనిచేశారు. ముఖ్యమంత్రి కాకముందు ఆయన కాంగ్రెస్ నుంచి ఆరు సార్లు లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు.
షీలా దీక్షత్:
ఢిల్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ కంటే ముందు మూడు సార్లు షీలా దీక్షత్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి 1998 నుంచి 2013 వరకు మూడు సార్లు పూర్తి కాలంపాటు సీఎంగా పనిచేశారు. 2013 ఎన్నికల్లో కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ చేతిలో ఓడిపోయారు.
వసంత్ రావు నాయక్:
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా మూడు సార్లు గెలిచారు. కాంగ్రెస్ పార్టీ నుంచి 1963 నుంచి 1975 దాకా వరుసగా మూడు పర్యాయాలు సీఎంగా పనిచేశారు.
కె కామరాజ్
తమిళనాడు నుంచి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వరుసగా 1954 నుంచి 1963 వరకు సీఎంగా గెలిచారు.
బిమల్ ప్రసాద్ చాలియా
అస్సాం నుంచి మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీ తరపున 1957 నుంచి 1970 వరకు ముఖ్యమంత్రిగా గెలిచి ప్రజలకు సేవలందించారు.
అరవింద్ కేజ్రీవాల్:
అన్నా హజారేతో పాటు అవినీతి వ్యతిరేక ఉద్యమాల్లో పాల్గొన్న కేజ్రీవాల్ ఢిల్లీ పీఠాన్ని వరుసగా మూడోసారి దక్కించుకున్నారు. ఐఆర్‌ఎస్ అధికారిగా పనిచేసిన కేజ్రీవాల్ 2013 డిసెంబర్ 28న తొలిసారి ఢిల్లీ ముఖ్యమంత్రి అయ్యారు. 2015లో జరిగిన ఎన్నికల్లో కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ తరపున 70 స్థానాలకు గాను 67 స్థానాల్లో గెలిచారు. ఇప్పుడు మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సీఎంల జాబితాలో చేరిపోయారు.