Indian Army destroys terror camps in Pakistan report (Photo-Twitter)

Sri Nagar, October 20: ఆర్టికల్ 370 రద్దుతో రగిలిపోతున్న పాకిస్తాన్ మరో సారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. భారత జవాన్లపై దాయాది దేశం యథేచ్ఛగా కాల్పులు జరిపింది. ఈ ఘటనలో ఇద్దరు భారత జవాన్లు అమరులయ్యారు. దీంతో భారత్ కూడా ప్రతీకార చర్యలకు దిగింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద శిబిరాలపై మెరుపుదాడులు చేసింది. ఈ దాడిలో 5 మంది పాక్ సైనికులు హతమయ్యారు. ఇంకొందరు గాయపడ్డారు. కుప్వారా జిల్లా తాంఘర్‌ సెక్టార్‌ సరిహద్దులో భారత్‌ బలగాలు గస్తీ నిర్వహిస్తుండగా పాకిస్థాన్‌ కాల్పులకు తెగబడడంతో భారత్‌ ఈ ఎదురు దాడి చేసింది.

కాల్పుల మాటున చొరబాటుదారులను భారత్‌ భూభాగంలోకి పంపించేందుకు పాకిస్థాన్‌ ప్రయత్నించిందని, భారత్‌ బలగాలు దీన్ని సమర్థంగా తిప్పికొట్టాయని సైనిక వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనలో రెండు ఇల్లు కూడా ధ్వంసమయ్యాయి.

ఇండియన్ ఆర్మీ మెరుపు దాడి

ఇండియన్ ఆర్మీ artillery guns ను ఉపయోగించి ఈ మెరుపు దాడులు చేసింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని నీలం వ్యాలీలో ఉన్న ఉగ్రస్థావరాలను లక్ష్యంగా చేస్తూ భారత్ దాడులకు దిగింది. పాక్ సైన్యం తేరుకునే లోపే అక్కడ స్థావరాలను నేలమట్టం చేసింది. ఈ విషయాన్ని ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ తెలిపింది. ఇదిలా ఉంటే గత కొంత కాలం నుంచి దాయాది దేశం పాకిస్తాన్ ఇండియాపై దాడి ఎప్పుడు చూద్దామా అని కాచుకూర్చుని ఉంది.

ఇండియా మెరుపు దాడి

దీనికి ప్రధాన కారణం ప్రధాని మోడీ ఆర్టికల్ 370ని రద్దు చేయడమే.. దీనిని వ్యతిరేకిస్తూ పాకిస్తాన్ ప్రపంచం దేశాల మద్దతు కూడగడుతోంది. అయినప్పటికీ ఈ దేశం పాకిస్తాన్ కు సహాయం చేయడం లేదు. అది భారత్ అంతర్గత వ్యవహారమని చర్చలకు భారత్ ఆహ్వానిస్తే మధ్యవర్తిత్వం వహిస్తామని చెబుతున్నాయి. కాగా భారత్ ఈ విషయంలో చర్చలకు అంగీకరించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది.