PM Narendra Modi-CAA: సీఏఏ, ఆర్టికల్ 370పై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు, ఎంత వ్యతిరేకత వచ్చినా నిర్ణయాలకు కట్టుబడి ఉంటాం, వారణాసిలో కీలక వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోదీ
Prime Minister Narendra Modi (Photo Credits: ANI)

Varanasi, February 17: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (CAA), జమ్ముకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దుపై (Article 370) వెనక్కితగ్గే ప్రసక్తే లేదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) స్పష్టం చేశారు.

సీఏఏ అమల్లోకి, ముస్లీంలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న కేంద్ర ప్రభుత్వం

జాతి ప్రయోజనాల కోసం ఉద్దేశించి తీసుకున్న నిర్ణయాలపై ఎన్ని వైపుల నుంచి ఒత్తిళ్లు వచ్చినా కట్టుబడే ఉంటామని స్పష్టం చేశారు. తన సొంత నియోజకవర్గం వారణాసిలో (Varanasi) ఆదివారం రోజంతా మోదీ పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

‘జమ్ము కశ్మీర్‌ స్వయంప్రతిపత్తిని కోల్పోయే ఆర్టికల్‌ 370 రద్దు, సీఏఏ నిర్ణయాల కోసం దేశ ప్రజలు ఎంతగానో ఎదురు చూశారు. ఎలాంటి ఒత్తిళ్లు వచ్చినప్పటికీ జాతి ప్రయోజనాలకు సంబంధించిన ఈ నిర్ణయాలపై మేము చాలా కచ్చితంగా నిలబడి ఉన్నాం.

PM Narendra Modi's Statement:

భవిష్యత్‌లో కూడా అలాగే ఉంటామని ప్రధాని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. దేశవ్యాప్తంగా సీఏఏకి వ్యతిరేకంగా ఇంకా నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి మోదీ తమ నిర్ణయానికి కట్టుబడే ఉంటామని గట్టిగా చెప్పారు.

అయోధ్యలో రామ మందిర నిర్మాణ పనులు ఇక వేగవంతం అవుతాయని మోదీ చెప్పారు. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర పేరుతో ట్రస్ట్‌ ఏర్పాటుచేశామని చెప్పారు. మందిర నిర్మాణంపై ఏర్పాటైన ట్రస్ట్‌కి 67 ఎకరాల భూమి అప్పగిస్తున్నామని, పనులు ఇక వాయువేగంతో సాగుతాయన్నారు.

అయోధ్యలో రామ‌మందిర్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్

కేంద్ర ప్రభుత్వం గతేడాది ఆగస్టులో ఆర్టికల్‌ 370ని రద్దు చేసింది. ఇటీవల తీసుకొచ్చిన సీఏఏకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

సీఏఏ నచ్చకుంటే దేశం విడిచి వెళ్లిపోండి

పర్యటనలో భాగంగా ఆరెస్సెస్‌ సిద్ధాంతకర్త పండిట్‌ దీనదయాల్‌ ఉపాధ్యాయ 63 అడుగుల విగ్రహాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. ఇది దేశంలోనే ఎత్తయిన దీనదయాల్‌ విగ్రహంగా రికార్డు నెలకొల్పనున్నది. ఆయన పేరుతో ఏర్పాటుచేసిన స్మారక కేంద్రాన్ని జాతికి అంకితం చేశారు.

నచ్చకుంటే పాకిస్తాన్ వెళ్లు

అలాగే ప్రధాని తన సొంత నియోజకవర్గంలో రూ.1,254 కోట్లు విలువ చేసే 50 ప్రాజెక్టులకు సంబంధించి శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ‘శ్రీ జగద్గురు విశ్వారాధ్య గురుకుల్‌' శతాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమంలోనూ మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘శ్రీ సిద్ధాంత శిఖామణి గ్రంథం’ 19 భాషల అనువాదాన్ని, మొబైల్‌ యాప్‌ను ప్రారంభించారు.

సీఏఏపై ప్రతిపక్షాలకు సవాల్ విసిరిన అమిత్ షా

ఉత్తరప్రదేశ్‌లోని కాశీ, మధ్యప్రదేశ్‌లో ఉజ్జయిని, ఓంకారేశ్వర్‌ జ్యోతిర్లింగ క్షేత్రాలకు వెళ్లడానికి వీలు కల్పించే ఐఆర్‌సీటీసీకి చెందిన ప్రైవేటు రైలు మహాకాళ్‌ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని వీడియో లింక్‌ ద్వారా ప్రారంభించారు. ఈ ఎక్స్‌ప్రెస్‌లో శివుడికి ప్రత్యేకంగా ఓ సీటు రిజర్వ్‌ చేశారు. ఎవరూ కూర్చోకుండా అది శివుడిదని తెలిసేలా బీ5 కోచ్‌లోని 64వ సీటును శివుడికి కేటాయించినట్లు ఉత్తర రైల్వే అధికార ప్రతినిధి దీపక్‌ కుమార్‌ తెలిపారు. ఈ సీటు కేవలం ఒక్కసారికేనా లేక శాశ్వతంగా ఉంటుందా అన్న విషయంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు.