Union Home Minister Amit Shah (Photo Credits: PTI)

Jabalpur, January 13: CAAతో ఎవరి పౌరసత్వం పోదని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా (Union Home Minister Amit Shah)అన్నారు.మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో CAAకు మద్దతుగా నిర్వహించిన సభలో అమిత్ షా (Amit Shah) ఈ అంశంపై ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు.

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)లో (CAA)ఏ ఒక్క భారతీయుడి పౌరసత్వాన్ని అయినా తొలగించే నిబంధన ఎక్కడ ఉందో చెప్పాలని పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీలకు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సవాల్‌ (Amit Shah challenges Opposition) విసిరారు.

వైసీపీ ఎంపీ లేఖపై స్పందించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా

అమిత్ షా మాట్లాడుతూ.. పార్లమెంట్‌లో ఆమోదం పొంది చట్టరూపు దాల్చిన సీఏఏను అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. పౌర చట్టంపై ప్రజలను తప్పుదారి పట్టించేలా కాంగ్రెస్‌ సహా విపక్షాలు దుష్ర్పచారం సాగిస్తున్నాయని ఆయన మండిపడ్డారు. సీఏఏ అమల్లోకి, ముస్లీంలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న కేంద్ర ప్రభుత్వం

ANI Tweet:

పాకిస్థాన్‌ (pakistan)దేశాల్లో అణచివేతకు గురై, అక్కడి నుంచి వచ్చే ప్రతి శరణార్థికి భారతీయ పౌరసత్వం లభించే వరకు తాము మౌనంగా కూర్చోబోమని చెప్పారు. భారతదేశంపై (India)మీకు, మాకు ఉన్నంత అధికారం, పాకిస్థాన్ నుంచి వచ్చే హిందూ, క్రైస్తవ, బౌద్ధ, సిక్కు, జైన, పారశీక శరణార్థులకు కూడా ఉందని చెప్పారు.

ANI Tweet:

అణిచివేతకు గురైన పాకిస్తానీ శరణార్ధులందరికీ భారత పౌరసత్వం ఇచ్చే వరకూ నరేంద్ర మోడీ ప్రభుత్వం విశ్రమించదని తేల్చిచెప్పారు. దేశ విభజన సమయంలో కాంగ్రెస్‌ పార్టీ దేశాన్ని మత ప్రాతిపదికన విభజించిందని, పాక్‌ నుంచి వచ్చే మైనారిటీ శరణార్ధులకు భారత పౌరసత్వం కల్పిస్తామని నాటి నేతలు హామీ ఇచ్చారని గుర్తుచేశారు.

చంపుకోవడం, కొట్టుకోవడం భారతదేశ చరిత్ర కాదు

తూర్పు, పశ్చిమ పాకిస్తాన్‌లో నివసించే హిందువులు, సిక్కులు, పార్శీలు, జైన్‌లు భారత్‌కు తిరిగి రావాలని కోరుకుంటున్నారని అన్నారు. దేశ విభజన సమయంలో పాకిస్తాన్‌లో 30 శాతంగా ఉన్న హిందువుల జనాభా నేడు 3 శాతానికి పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.