Union Home Minister Amit Shah during discussion in Rajya Sabha on CAA (Photo Credits: IANS)

New Delhi, January 11: పౌరసత్వ సవరణ చట్టం (Citizenship Amendment Act (CAA))జనవరి 10వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిందని కేంద్రం శుక్రవారం ప్రకటించింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌ల్లో ( Pakistan, Bangladesh, Afghanistan ) మత వివక్ష ఎదుర్కొని భారత్‌కు శరణార్ధులుగా వచ్చిన హిందూ, సిఖ్, జైన్, పార్శీ, క్రిస్టియన్, బౌద్ధ మతస్తులకు(Hindu, Christian, Sikh, Buddhist and Parsi communities) భారత పౌరసత్వం( Indian citizenship) కల్పించేందుకు ఈ చట్టాన్ని రూపొందించారు. కాగా పౌరసత్వ సవరణ బిల్లుకు 2019 డిసెంబర్‌ 11న పార్లమెంట్‌ ఆమోదం తెలిపిన విషయం విదితమే.

ఎస్పీజీ సవరణ బిల్లు రాజ్యసభలో ఆమోదం

అయితే, ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో ఉద్యమం కొనసాగుతోంది. కాగా, సీఏఏ పేరుతో దేశంలో తొలిసారి మతం ఆధారంగా పౌరసత్వాన్ని కల్పిస్తున్నారని, రాజ్యాంగంలోని మౌలిక సిద్ధాంతాలను ఈ చట్టం ఉల్లంఘిస్తోందని ఆరోపిస్తూ ముస్లింలతోపాటు విపక్ష పార్టీలు ఈ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

పౌరసత్య సవరణ బిల్లు లోక్‌సభలో  ఆమోదం

దేశాన్ని మత పరంగా విభజించేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తోందని ఆరోపిస్తూన్నారు. సీఏఏకి వ్యతిరేకంగా నెల రోజులుగా దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

Official Notification of The Act:

మూడు పొరుగు దేశాల నుండి 2014 కి ముందు భారతదేశానికి వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు మాత్రమే పౌరసత్వం ఇస్తానని హామీ ఇచ్చే ఈ చట్టం దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. రాజ్యాంగంలోని ప్రాథమిక సిద్ధాంతాలను ఉల్లంఘించి.. మతం ఆధారంగా భారతదేశం ( India) మొదటిసారి పౌరసత్వం ఇస్తుందని ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న వారు అంటున్నారు.

పౌరసత్వ (సవరణ) బిల్లు-2019కు రాజ్యసభ ఆమోదం

సీఏఏ ఆమోద యోగ్యం కాదని, రద్దు చేయాలని పలువురు మేధావులు సైతం డిమాండ్ చేశారు. అయితే.. దేశ ప్రయోజనాల కోసమే ఈ చట్టం తెచ్చామని బీజేపీ చెబుతోంది. ఈ చట్టంతో ముస్లింలకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పింది.

పౌరసత్వ సవరణ బిల్లు అంటే ఏమిటి?

ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చింది. రాజకీయ లబ్ది కోసమే కొన్ని పార్టీలు ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాయని, దుష్ప్రచారం చేస్తున్నాయని బీజేపీ(BJP) ఆరోపించింది.

ముస్లింలకు150 దేశాలు ఉన్నాయి, హిందువులకు ఇండియా ఒక్కటే ఉంది

దేశంలో అక్రమ వలసదారులను ఏరివేస్తాం