Aligarh, February 10: ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎంపీ సతీశ్ గౌతమ్ (BJP MP Satish Gautam) సామాజిక కార్యకర్త సుమైయా రానాను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో ఉండేందుకు ఇబ్బందులు పడుతున్న వారు పాకిస్తాన్ వెళ్లిపోవచ్చునని అలీఘర్ బీజేపీ ఎంపీ అన్నారు. హిందుస్తాన్‌పై అక్కసు వెళ్లగక్కే దేశద్రోహులకు పాకిస్తాన్ (Pakistan) ఎప్పుడూ ఆహ్వానం పలుకుతుందని ఆయన ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యలు అనడానికి కారణం లేకపోలేదు. షాహిన్ బాగ్ నిరసనలపై సుప్రీంకోర్టులో విచారణ
అలీఘడ్‌లో పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ చేపట్టిన ఆందోళనలో సుమైయా రానా (Sumaiya Rana) పాల్గొన్నారు. సీఏఏను (CAA) వ్యతిరేకిస్తున్న వారిపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం (UP Govt) చేపడుతున్న అణచివేత చర్యలు..కనీసం ప్రజలు ఊపిరి తీసుకొనే అవకాశం లేకుండా చేస్తున్నాయని సుమైయా రానా మండిపడ్డారు.
సీఏఏని ఎట్టి పరిస్థితుల్లో అమలు కానివ్వం
ప్రముఖ కవి మునవ్వార్ రాణా కూతురు అయిన సుమైయా దేశంలో పరిస్థితులు బతికేందుకు అనువుగా లేవని, ఇక్కడ ఉండలేకపోతున్నామని ఈ సందర్భంగా అసహనం వ్యక్తం చేశారు.
ఫోటోలను విడుదల చేయనున్న యూపీ పోలీస్
సుమైయా వ్యాఖ్యలకు కౌంటర్‌గా ఎంపీ ఆ వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో భావ ప్రకటనా స్వేచ్ఛకు కొదవ లేదని, ఆ స్వేచ్ఛ అందరికీ ఉంటుందని ఎంపీ సతీశ్ గౌతమ్ తెలిపారు. అయిష్టంగా, ఇబ్బందులు పడుతూ హిందుస్తాన్‌లో ఉండాల్సిన అవసరం ఏమిటని, సుమైయా స్వేచ్ఛగా పాకిస్తాన్ వెళ్లిపోవచ్చునని అన్నారు.
సీఏఏ నచ్చకుంటే దేశం విడిచి వెళ్లిపోండి
అంతేకాదు గత డిసెంబర్ 16 నుంచి సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న అలీఘడ్ ముస్లిం యూనివర్సిటీ విద్యార్థులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. సుమారు 150 మంది విద్యార్థులు అలీఘడ్ ముస్లిం యూనివర్సిటీలో ఇప్పటికే ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నట్లు చెపారు.