Jaipur, January 1: దేశ వ్యాప్తంగా జాతీయ పౌరసత్వ సవరణ చట్టానికి(సీఏఏ)(Citizenship Amendment Act) వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళనలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో రాజస్తాన్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే మదన్ దిలావర్ (BJP MLA Madan Dilawar) సంచలన వ్యాఖ్యలు చేశారు.
జాతీయ పౌరసత్వ సవరణ చట్టానికి(సీఏఏ) వ్యతిరేకంగా (anti-CAA stir) నిరసన తెలిపేవారంతా దేశానికి శతృవులేనని వారంతా దేశ ద్రోహులు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సీఏఏను ఎవరైతే వ్యతిరేకిస్తూ దేశంలో అల్లర్లు సృష్టిస్తున్నారో, ఆందోళనలు చేస్తున్నారో వారంతా దేశం విడిచి వెళ్లాలని తెలిపారు.
వెంటనే పాకిస్తాన్ వెళ్లిపోండి, మీరట్ ఎస్పీ అఖిలేష్ నారాయణ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు
దేశానికి సంబంధించి ఆస్తుల్ని తగులబెట్టే వాళ్లు..పోలీసులపై దాడులు చేసేవాళ్లు అలాగే అటువంటి నిరసనకారులను ఎవరైతే సమర్థిస్తున్నారో వారంతా ఈ దేశానికి శత్రువులేనని ఆయన వ్యాఖ్యానించారు.
Update by ANI
Rajasthan BJP MLA, Madan Dilaawar: They do not have the right to live in this country. If they love Pakistan they should go there, if they love Bangladesh they should go there, and if both the countries don't want them, they can drown in the Indian ocean. (30.12.19) https://t.co/9vvdWKQZ1j
— ANI (@ANI) December 31, 2019
జాతీయ పౌరసత్వ చట్ట సవరణ నచ్చకుంటే వెంటనే పాకిస్థాన్ కు వెళ్లిపోవచ్చనీ..లేదంటే బంగ్లాదేశ్ కు అదీ కాకుంటే ఆఫ్ఘనిస్తాన్.. ఇలా వారికి నచ్చిన దేశానికి వెళ్లిపోండని వార్నింగ్ తో కూడిన వ్యాఖ్యలు చేశారు. ఇక ఆయా దేశాల వారు ఒప్పుకోకుంటే హిందూ మహా సముద్రంలో దూకండి (Indian Ocean) అంటూ మదన్ దిలావర్ వివాదాస్ప వ్యాఖ్యలు చేసారు.
వారు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ ఇలా ఎవరైనా కావొచ్చన్నారు. సీఏఏ నచ్చకుంటే వారుకూడా వెళ్లిపోవచ్చని అన్నారు. సీఏఏను వ్యతిరేకించేవారికి ఈ దేశంలో నివసించే హక్కు లేదని మదన్ దిలావర్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు సంచలనమై ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.