ongress general secretary Priyanka Gandhi in Lucknow on Saturday. (Photo Credit: IANS)

Lucknow, December 29: కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ (Priyanka Gandhi Vadra)లక్నో పోలీసులపై ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ 135వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా శనివారం లక్నోలో (Lucknow)ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రియాంక గాంధీ పాల్గొన్న విషయం తెలిసిందే. అయితే కార్యక్రమం అనంతరం పౌరసత్వ సవరణ చట్టంపై(Citizenship Amendment Act) నిరసన సందర్భంలో ఇటీవల చోటుచేసుకున్న ఆందోళనలో గాయపడ్డవారిని పరామర్శించేందుకు ప్రియాంక బయలుదేరారు.

అయితే ఆమె వెళ్లడానికి వీళ్లేదంటూ అక్కడి పోలీసులు రోడ్డుపైనే అ‍డ్డుకున్నారు. ఈ సమయంలో తనపై అక్కడి పోలీసులు అసభ్యకరంగా ప్రవర్తించారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై పోలీసులు చేయి చేసుకున్నారని, మెడపై చేయి వేసి పక్కకు నెట్టివేశారని(Priyanka Gandhi Heckling Row) ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రతిఘటించిన తనపై దాడి కూడా చేశారని ప్రియాంక ఆరోపించారు.

Here are Kalanidhi Naithini's tweets:

అయితే ఈ వ్యాఖ్యలను లక్నో ఎస్ఎస్పి కలానిధి నైతిని (Kalanidhi Naithini) ఖండించారు. ప్రియాంక గాంధీ గొంతును పోలీసులు పట్టుకున్నారనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని అన్నారు. సోషల్ మీడియాలో(Social Media) వస్తున్న వార్తలను నమ్మవద్దని కోరారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ విషయాన్ని ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ ట్వీట్ చేసింది.

ఈ ట్వీట్ ప్రకారం "ఈ రోజు, ఉదయం ఏరియా ఇన్‌ఛార్జ్, డాక్టర్ అర్చన సింగ్ అదనపు సూపరింటెండెంట్‌కు ఒక నివేదికను సమర్పించారు, అక్కడ ప్రియాంక గాంధీ వాద్రా కారు షెడ్యూల్‌ ప్రకారం కాకుండా వేరే మార్గం ద్వారా వెళుతుంటే ఆపామని తెలిపారు. అనుకున్న మార్గంలోనే వెళ్లాలని కోరామని తెలిపారు.

Here's the ANI tweet of Priyanka Gandhi travelling in scooter.

అయితే కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ వాద్రా కారును వదిలేసి టూవీలర్ మీద ప్రయాణం చేశారు. మాజీ ఐపీఎస్ అధికారి ఎస్ఆర్ దారాపురి (SR Darapuri)కుటుంబసభ్యులను కలిసేందుకు లక్నో వెళ్లిన ఆమె కారును పోలీసులు ఆపడంతో ప్రియాంకా గాంధీ కారును వదిలి ద్విచక్రవాహనంపై వెళ్లారు.

సీఏఏ, ఎన్నాఆర్సీలపై డిసెంబరు 19నుంచి ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు పలు సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటున్నారు. అక్కడికి చేరుకున్న ప్రియాంకను రెండు పాయింట్ల దగ్గర ఆపేశారు. సాయంత్రం 5గంటల 30నిమిషాలకు ఈ ఘటన జరిగింది. వారితో వాదనకు దిగడంతో పాలిటెక్నిక్ స్క్వేర్ లోకి అనుమతి ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. సూచనలు ఉల్లంఘించి వెళ్లకూడదని పోలీసులు వారించారు.

Here's what Priyanka Gandhi said:

దీంతో కారు దిగి పాలిటెక్నిక్ స్క్వేర్‌కు 2.5కిలోమీటర్ల దూరంలోనే దారాపురి ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. తనను అడ్డుకునే క్రమంలో పోలీసులు చూపించిన వైఖరి సబబు కాదని అంటూనే 'ఈ పోలీసులేం చేస్తున్నారు. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఉన్నతాధికారుల చేతిలోనే ఉంది. ప్రజలను కలవడానికి కూడా అనుమతించడం లేదు' అని వాపోయారు.