Lucknow, December 25: సిటిజెన్‌షిప్ అమెండ్‌మెంట్ యాక్ట్ (సిఎఎ)కు (Citizenship Amendment Act) వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనల సమయంలో ప్రభుత్వ ఆస్తులకు జరిగిన నష్టాన్ని నిరసనకారులనుంచి రికవర్ చేయడానికి ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం (Uttar Pradesh government) సమాయత్తమైంది.
ప్రభుత్వ ఆస్తులకు వాటిల్లిన నష్టం కింద 14.86 లక్షల రూపాయిలను వసూలు చేయడానికి అధికారులు 28 మందికి నోటీసులు జారీ చేశారు. నిరసనకారులపై ప్రతీకారం తీర్చుకుంటామ”ని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Chief Minister Yogi Adityanath )ప్రకటించిన తరువాత అధికారులు ఈ చర్య చేపట్టారు.
ముస్లింలకు150 దేశాలు ఉన్నాయి, హిందువులకు ఇండియా ఒక్కటే ఉంది
ఇందులో భాగంగా యోగీ ప్రభుత్వం ఆందోళనకారులకు (Protests) నోటీసులు పంపింది. దీంతో పాటు దెబ్బతిన్న పోలీసు హెల్మెట్లు, లాఠీలు, పెలెట్స్ కోసం కూడా పరిహారం చెల్లించాలని కూడా యూపీ సర్కార్ ఆదేశించింది. గతవారం ఉత్తరప్రదేశ్ రాంపూర్లో సీఏఏ నిరసన కార్యక్రమం హింసాత్మకంగా మారింది. ఈ హింసకు కారణమని ఆరోపిస్తూ 31మందిని ఇప్పటికే అరెస్టు చేశారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన వారిని సీసీటీవీ ఫుటేజీ ద్వారా గుర్తించి వారి ఆస్తులను స్వాధీనం చేసుకుని, వేలం వేస్తామని, తద్వారా నష్టాన్ని భర్తీ చేస్తామని, ప్రతీకారం తీర్చుకుంటామని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఉత్తర ప్రదేశ్ లో పెద్ద ఎత్తు ఆందోళనలు చెలరేగిన విషయం తెలిసిందే. ఆందోళనల సందర్భంగా రాజధాని లక్నో సహా బులంద్ షహర్, బహ్రెయిచ్, గౌతమబుద్ధ నగర్, ముజప్ఫర్ నగర్, ఘజియాబాద్, రామ్ పూర్ వంటి సుమారు 20 జిల్లాల్లో పెద్ద ఎత్తున విధ్వంసానికి గురైంది. పలు చోట్ల ప్రభుత్వ ఆస్తులను తగులబెట్టారు నిరసనకారులు. ఉత్తర ప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ బస్సులు, పోలీసు వాహనాలకు నిప్పు పెట్టారు.
నా దిష్టి బొమ్మలు కాల్చండి..అంతేకాని ప్రజల ఆస్తులను ధ్వంసం చేయకండి
అల్లర్లకు పాల్పడిన వారిని సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా గుర్తించారు. వారికి నోటీసులను జారీ చేశారు. తొలిదశలో 28 మంది ఆందోళనకారులకు స్థానిక మున్సిపల్, హోం మంత్రిత్వ శాఖ అధికారులు రికవరీ నోటీసులను పంపించారు. ఎందుకు నోటీసులను పంపించాల్సి వచ్చిందనే విషయాన్ని ఇందులో పొందుపరిచారు.