Indian Army Daring Operation Army Defused IED Found Near Kashmir Bridge (Photo-ANI)

New Delhi, November 22: ఇండియన్ ఆర్మీ డేరింగ్ ఆపరేషన్ (Indian Army Daring Operation) చేపట్టింది. భార‌త ఆర్మీకి చెందిన బాంబు డిస్పోజ‌ల్ స్క్వాడ్ రెండు భారీ ఐఈడీ బాంబుల‌( Improvised Explosive Device)ను నిర్వీర్యం చేసింది. జ‌మ్మూక‌శ్మీర్‌(Jammu and Kashmir)లోని కుద్వానీ బ్రిడ్జ్ వ‌ద్ద భారత ఆర్మీ ఈ ఆప‌రేష‌న్ చేప‌ట్టింది. సిలిండ‌ర్ ఆకారంలో ఉన్న రెండు ఐఈడీ బాంబు బాక్సుల‌ను తొవ్వి తీసి.. వాటిని విజ‌య‌వంతంగా నిర్వీర్యం చేశారు.

నేష‌న‌ల్ హైవే 11వ‌పై ఉన్న బ్రిడ్జ్ (Khudwani Bridge on National Highway 11) వ‌ద్ద ఐఈడీ బాంబుల‌ను అమ‌ర్చారు. వాటిని గుర్తించిన బాంబు డిస్పోజ‌ల్ స్క్వాడ్ ఆ బాంబుల‌ను చాక‌చ‌క్యంగా నిర్వీర్యం చేసింది. గురువారం మొత్తం 25 కేజీల పేలుడు ప‌దార్ధాల‌(25 kilograms of explosives)ను గుర్తించారు.

ఓ బ్యాగ్‌లో 15 కిలోలు, మ‌రో బ్యాగ్‌లో 10 కిలోల పేలుడు ప‌దార్ధాలు ఉన్నాయి. ఒకవేళ ఐఈడీలు పేలితే భారీ ప్రాణ న‌ష్టం ఉండేద‌ని ఆర్మీ అభిప్రాయ‌ప‌డింది. జాతీయ ర‌హ‌దారిపై ఎటువంటి ర‌క్త‌పాతం జ‌ర‌గ‌కుండా ఆర్మీ సాహ‌సోపేతంగా బాంబుల‌ను నిర్వీర్యం చేసింది.

బాంబులను నిర్వీర్యం చేస్తున్న ఆర్మీ 

కాగా ఆర్టికల్ 370 రద్దు తర్వాత నుంచి జమ్మూ కాశ్మీర్ లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం అక్కడ భద్రతను కట్టుదిట్టం చేసింది. ఇందులో భాగంగా అక్కడ ఇంటర్నెట్, ఫోన్ కకెక్షన్ వంటి సదుపాయాలపై ఆంక్షలు విధించింది.

ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్ లో అలజడులు లేపకుండా ఉండేందుకు ఇండియన్ ఆర్మీ భద్రతను కట్టుదిట్టం చేసింది. భద్రతను ఎంత కట్టుదిట్టం చేసినా ఉగ్రవాదులు ఏదో రూపంలో అక్కడ విరుచుకుపడుతూనే ఉన్నారు. తాజాగా బయటకు వచ్చిన ఈ బాంబుల ఉందతమే దీనికి ప్రత్యక్ష్య సాక్ష్యంగా చెప్పవచ్చు.