PM Modi vs Chidambaram: ప్రధాని మోదీకి చిదంబరం చురక, 2013లో మోదీ చేసిన ట్వీట్‌ను పోస్ట్ చేసిన మాజీ ఆర్థిక మంత్రి, ప్రధానికి చెప్పదలుచుకున్నది ఇదే అంటూ విమర్శ

ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) హయాంలో దేశ ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిపోయిందని కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ ఉన్న సమయంలో ఆయన చేసిన ఓ ట్వీట్‌కు సంబంధించిన‌ స్క్రీన్‌ షాట్‌ను తాజాగా పోస్ట్ చేసిన కాంగ్రెస్‌ నేత పి.చిదంబరం తీవ్ర విమర్శలు (PM Modi vs Chidambaram) గుప్పించారు.

File image of P Chidambaram | (Photo Credit:s PTI)

New Delhi, September 2: దేశంలో జీడీపీ రేటు దారుణంగా పడిపోవడంపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ బీజేపీపై విమర్శల దాడి చేస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) హయాంలో దేశ ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిపోయిందని కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ ఉన్న సమయంలో ఆయన చేసిన ఓ ట్వీట్‌కు సంబంధించిన‌ స్క్రీన్‌ షాట్‌ను తాజాగా పోస్ట్ చేసిన కాంగ్రెస్‌ నేత పి.చిదంబరం తీవ్ర విమర్శలు (PM Modi vs Chidambaram) గుప్పించారు.

2013లో చిదంబరం (P Chidambaram) ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో పడిందని, యువతకు ఉద్యోగాలు కావాలని మోదీ అన్నారు. సమయాన్ని అనవసర రాజకీయ చర్యలకు కాకుండా ఆర్థికవ్యవస్థను బాగు చేసేందుకు (Shrinking Economy) కేటాయించాలని మోదీ అప్పట్లో ట్వీట్ చేశారు. జీడీపీ భారీగా పతనం..నోట్ల రద్దుతో ఆర్థిక వ్యవస్థ నాశనం, కేంద్రంపై విరుచుకుపడిన కాంగ్రెస్ పార్టీ

ఆ ట్వీట్‌నే ఈ రోజు చిదంబరం గుర్తు చేస్తూ తాను కూడా ఇప్పుడు ప్రధానికి చెప్పదలుచుకున్నది అదే (I Have To Say The Same Thing) అంటూ చురకలంటించారు. కాగా, మోదీ హయాంలో దేశ ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిపోయిందని కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తోన్న విషయం తెలిసిందే. మోదీ అసమర్థ నిర్ణయాల వల్ల జీడీపీ తగ్గిపోతోందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రాలకు జీఎస్టీ ప‌రిహారం పూర్తిగా చెల్లించాలి, ప్రధానికి లేఖ రాసిన తెలంగాణ సీఎం కేసీఆర్

Here's P Chidambaram's tweet:

కరోనా వల్లనే జీడీపీ వృద్ధి రేటు పడిపోయింది... ఇది దేవుని చర్య (Act of God) అంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చేసిన వ్యాఖ్యలపై చిదంబరం ఆగ్రహం వ్యక్తం చేశారు. మానవ తప్పిదాన్ని దేవుడి మీదకు నెట్టకూడదన్నారు. ప్రభుత్వం ప్రకటించిన ఉపశమన ప్యాకేజీని ఒక జోక్‌గా వర్ణించారు చిదంబరం



సంబంధిత వార్తలు