‘Enemy’ Properties - Amit Shah: రూ.లక్ష కోట్ల ఆదాయం లక్ష్యంగా శత్రు ఆస్తుల అమ్మకం, హోమంత్రి అమిత్ షా నాయకత్వంలో అమ్మకాలను పర్యవేక్షించనున్న మంత్రుల బృందం, ప్రత్యేకంగా ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్‌, ఇంతకీ ఏమిటీ ఈ శత్రు ఆస్తుల అమ్మకం?

ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ((PM Modi Govt) సరికొత్త వ్యూహాంతో ముందుకు వెళుతోంది. ఈ వ్యూహం ద్వారా దేశానికి రూ.లక్ష కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇందులో భాగంగా భారతదేశంలోని శత్రువుల ఆస్తులను(Enemy properties) అమ్మేయడానికి కేంద్ర ప్రభుత్వం (Central Govt)సిద్ధమవుతోంది.

Union Home Minister & BJP leader Amit Shah (Photo-PTI)

New Delhi, January 24: ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ((PM Modi Govt) సరికొత్త వ్యూహాంతో ముందుకు వెళుతోంది. ఈ వ్యూహం ద్వారా దేశానికి రూ.లక్ష కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇందులో భాగంగా భారతదేశంలోని శత్రువుల ఆస్తులను (Enemy Properties) అమ్మేయడానికి కేంద్ర ప్రభుత్వం (Central Govt) సిద్ధమవుతోంది.

అయోధ్యలో ఆకాశాన్ని తాకేలా రామమందిరం

1947 లో దేశ విభజన జరిగినపుడు, ఆ తర్వాత జరిగిన యుద్ధాల నేపథ్యంలో తమ ఆస్తులను వదిలిపెట్టి, పాకిస్థాన్, (pakistan)చైనా(China) అలాగే ఇతర దేశాలకు వెళ్ళిపోయిన వారి ఆస్తులనే శత్రు ఆస్తులగా పరిగణిస్తారు. ఇప్పుడు ప్రభుత్వం వీటిని అమ్మాలని నిర్ణయించింది. ఈ ఆస్తుల విలువ సుమారు రూ. లక్ష కోట్లు ఉంటుందని అంచనా..

హోంమంత్రి అమిత్‌ షా (Home Minister Amit Shah) నేతృత్వంలోని మంత్రుల బృందం ‘శత్రు ఆస్తుల’ అమ్మకాన్ని పర్యవేక్షించనుంది. దేశవ్యాప్తంగా దాదాపు 9,400 శత్రు ఆస్తులున్నాయి. వాటిని అమ్మకం జరపడం ద్వారా సుమారు రూ.లక్ష కోట్లు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇందుకోసం మంత్రుల బృందంతో పాటు మరో రెండు ఉన్నతస్థాయి కమిటీలను ఏర్పాటు చేశారు.

NRCకి మరియు NPRకి మధ్య ఎలాంటి సంబంధం లేదు

దేశ విభజన అనంతరం పాకిస్తాన్‌, చైనాలకు వెళ్లి, అక్కడి పౌరసత్వం పొందినవారు ఇండియాలో (India) తమ ఆస్తులను వదిలేసి వెళ్లారు. అవి ఇప్పటికీ అలాగే ఉన్నాయి. వీటిని వారు వదిలేసినట్లుగా ప్రభుత్వం భావించి అమ్మకాలు జరిపేందుకు సర్వం సిద్ధం చేసింది.

భద్రత అనేది స్టేటస్ సింబల్ కాదు

వీటి కోసం ప్రత్యేకంగా ‘ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్‌’ను (Enemy Property Act) సైతం రూపొందించారు. ఈ శత్రు ఆస్తుల్లో పాక్‌ వెళ్లిన వారివి 9,280 ఉండగా, చైనా వెళ్లినవారివి 126 ఉన్నాయి. పాకిస్తాన్‌ వెళ్లినవారి ఆస్తుల్లో 4,991 యూపీలో, 2,735 పశ్చిమ బెంగాల్‌లో, 487 ఢిల్లీలో ఉన్నాయి.

ఢిల్లీలో కాషాయపు జెండా ఎగరేస్తాం, గురుద్వారా దాడిపై కాంగ్రెస్ మౌనమెందుకు..?

ఇప్పటికే వారి ఆస్తులను (భూములు, ఇళ్ళు, షేర్లు) ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. నరేంద్ర మోడీ ప్రభుత్వం శత్రు ఆస్తుల చట్టం, 1968 ని మరింత పటిష్టం చేసింది. శత్రువుల వారసులు భారతదేశంలోనే ఉన్నప్పటికీ, వారికి ఈ ఆస్తులు చెందకుండా నిబంధనలను తీసుకొచ్చింది.

దేశంలో అక్రమ వలసదారులను ఏరివేస్తాం

శత్రు ఆస్తులను ధన రూపంలోకి మార్చడానికి ఈ నింబంధన దోహదపడుతుందని, శత్రు ఆస్తుల చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇవి స్తబ్ధంగా ఉండిపోయాయని ప్రభుత్వం పేర్కొంది. అయితే పాకిస్థాన్‌లో కూడా ఇటువంటి చట్టమే ఉంది. భారతదేశానికి వచ్చినవారి ఆస్తులను ఆ దేశం స్వాధీనం చేసుకుంది.

అమిత్ షా కొత్త స్కెచ్, మమతను ఢీకొట్టేందుకు బెంగాలీ భాషతో కుస్తీ

1968 నాటి శత్రు ఆస్తుల (సవరణ, క్రమబద్దీకరణ) బిల్లు 2016 ఇప్పటికే లోక్‌సభ, రాజ్యసభలో అమోదం పొందింది కూడా. కేంద్ర ప్రభుత్వం కస్టోడియన్‌ ద్వారా ఈ ఆస్తులను పర్యవేక్షిస్తుంది. 1965 లో ఇండో-పాక్‌ యుద్ధం అనంతరం 1968 లో ఈ చట్టాన్ని తీసుకువచ్చిన ప్రభుత్వం సదరు ఆస్తులను కస్టోడియన్‌కు సంక్రమింపచేసింది. శత్రు ఆస్తులకు వారసత్వ చట్టం వర్తించకుండా చేయడమే విరోధి ఆస్తుల చట్టం ఉద్దేశ్యంగా ప్రభుత్వం పేర్కొంది.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now