Narendra Modi On Anti-CAA Protest: స్వార్థపరుల ఆటలు ఇక సాగవు, ఆవదంతులు నమ్మవద్దు, సీఏఏతో భారతీయులకు ఎలాంటి నష్టం జరగదు, హింసాత్మక నిరసనలు మన ధర్మం కాదన్న ప్రధాని మోడీ

ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీలో విద్యార్థులు నిన్న ఆందోళనకు దిగారు. హింసాత్మక ఘటనలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్శిటీలో (Jamia Millia Islamia University) పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా విద్యార్థులు ఆందోళన చేస్తున్న సమయంలో హింసాత్మక ఘటనలు జరగడంపై ప్రధాని మోడీ (Prime Minister Narendra Modi)విచారం వ్యక్తం చేశారు.

PM Narendra Modi. (Photo Credits: ANI)

New Delhi, December 16: జాతీయ పౌరసత్వ సవరణ చట్టంపై(Citizenship Amendment Act) ఈశాన్య రాష్ట్రాలు సహా పలుచోట్ల నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీలో విద్యార్థులు నిన్న ఆందోళనకు దిగారు. హింసాత్మక ఘటనలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్శిటీలో (Jamia Millia Islamia University) పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా విద్యార్థులు ఆందోళన చేస్తున్న సమయంలో హింసాత్మక ఘటనలు జరగడంపై ప్రధాని మోడీ (Prime Minister Narendra Modi)విచారం వ్యక్తం చేశారు.

ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని అన్నారు. దేశాభివృద్ధే లక్ష్యంగా అందరం కలిసి పనిచేయాలని, భారతీయులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.ప్రజా ఆస్తులకు నష్టం, సాధారణ జీవితానికి భంగం కలిగించడం దేశ ధర్మంలో భాగం కాదని మోడీ అన్నారు.

PM Narendra Modi on Protests Against Citizenship Amendment Act:

 

 

 

 

ప్రజాస్వామ్యంలో (democracy)ఏ సమస్యకైనా చర్చలే పరిష్కారమని, ఆస్తులను ధ్వంసం చేయడం, ప్రజాజీవితానికి ఆటంకాలు కలిగించడం సబబు కాదని అన్నారు. పౌరసత్వ సవరణ చట్టం శతాబ్దాల భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తోందని, ఈ చట్టం మతసామరస్యం, సోదరభావానికి ప్రతీకగా నిలుస్తోందని అన్నారు. ఏ ప్రాంతానికి చెందిన పౌరుడికీ ఈ చట్ట సవరణ ద్వారా ఎలాంటి నష్టం జరగబోదని మరోమారు స్పష్టం చేశారు.

దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనే స్వార్థపరుల ఆటలు సాగనివ్వబోమని హెచ్చరించారు. శాంతి, ఐక్యత, సౌభ్రాతృత్వాన్ని కాపాడాల్సిన సమయమిదని, ఎలాంటి వదంతులు నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. ప్రజా ఆస్తులకు నష్టం చేకూర్చడం, సాధారణ జీవితానికి భంగం కలిగించడం మన ధర్మంలో భాగం కాదు అని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.

 

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు..క్రమ క్రమంగా దేశంలోని వివిధ యూనివర్సిటీలకు పాకుతున్నాయి. ఢిల్లీలోని JNU, జామియా వర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీ, కోల్ కతా జాదవ్ యూనివర్సిటీ, వారణాసిలోని బనారస్ హిందూ వర్సిటీ, యూపీలోని ఆలీఘడ్ ముస్లిం వర్సిటీ, దక్షిణాది ప్రాంతంలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, మౌలానా ఆజాద్ ఉర్దూ వర్సిటీలో స్టూడెంట్స్ ఆందోళనలు చేపడుతున్నారు.

కాగా జామియా విద్యార్థులపై పోలీసలు లాఠీ ఝులిపించడాన్ని అందరూ ఖండిస్తున్నారు. జామియా యూనివర్శిటీ విద్యార్థులకు సంఘీభావం ప్రకటిస్తున్నారు. మరోవైపు సుప్రీంకోర్టు ముందుకు జామియా యూనివర్సటీ ఘటన రాగా తాము ఇప్పుడే జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. అల్లర్లు అదుపులోకి వస్తే..విచారణ జరుపుతామని స్పష్టం చేసింది.



సంబంధిత వార్తలు