PM Unveils BJP Manifesto for LS Polls: రానున్న లోక్ సభ ఎన్నికల కోసం ‘సంకల్ప పత్రం’ పేరిట బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో.. పైప్ లైన్ ద్వారా ఇంటింటికీ గ్యాస్, 3 కోట్ల ఇళ్ల నిర్మాణం, 70 ఏళ్లు పైబడిన వృద్ధులకు రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం, రాబోయే ఐదేళ్లు ఉచిత రేషన్
‘గ్యాన్’ అభివృద్ధి లక్ష్యంగా (GYAN - గరీబ్, యూత్, ఫార్మర్స్, ఉమెన్స్) ఈ మేనిఫెస్టోను రూపొందించారు.
Newdelhi, Apr 14: లోక్ సభ ఎన్నికలకు (LS Polls) ‘సంకల్ప పత్రం’ పేరిట బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) నేడు విడుదల చేశారు. ‘గ్యాన్’ అభివృద్ధి లక్ష్యంగా (GYAN - గరీబ్, యూత్, ఫార్మర్స్, ఉమెన్స్) ఈ మేనిఫెస్టోను రూపొందించారు. ఈ కార్యక్రమంలో ప్రధానితో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొన్నారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.
Salman Khan: ముంబైలోని సల్మాన్ నివాసం వద్ద కాల్పుల కలకలం.. ఫైరింగ్ జరిపిన ఆగంతకుడు
బీజేపీ ఎన్నికల హామీలు ఇవే..
- రానున్న కాలంలో పైప్ లైన్ ద్వారా ఇంటింటికీ గ్యాస్
- రాబోయే ఐదేళ్లు కూడా ఉచిత రేషన్
- వచ్చే ఐదేళ్లలో మరో 3 కోట్ల గృహాల నిర్మాణం
- 70 ఏళ్లు పైబడిన వృద్ధులకు రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం
- పప్పుధాన్యాలు, వంటనూనెలు, కూరగాయల ఉత్పత్తిలో స్వయం ప్రతిపత్తి
- ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన సంక్షేమ పథకాల విస్తరణ
- ధరల స్థిరీకరణపై ఫోకస్.. ప్రతి ఇంటికి తాగునీరు