MAHA CM Poster At Matoshree: ఉద్ధవ్ ఠాక్రే సీఎం అంటూ పోస్టర్, శివసేన చీఫ్ ఇంటివద్ద ఫ్లెక్సీ బ్యానర్, గతంలో ఆదిత్య ఠాక్రే సీఎం అంటూ బ్యానర్లు, మహాలో రంజుగా సాగుతున్న రాజకీయం
ఇందులో భాగంగా శివసేన పార్టీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేనే మాకు సీఎంగా ఉండాలంటూ వెలిసిన ఓ బ్యానర్ మహా రాజకీయాల్లో మరింత వేడిని రాజేస్తోంది.
Mumbai, Novemebr 10: ఫలితాలొచ్చి ఒక్కరోజు కూడా గడవక ముందే ‘భావి సీఎం ఆదిత్య ఠాక్రే’ అంటూ మహారాష్ట్ర అంతటా పోస్టర్లుతో సంచలనం రేకెత్తించిన శివసేన కార్యకర్తలు ఇప్పుడు మళ్లీ కొత్త పోస్టర్లతో రాజకీయాల్లో మరింతగా వేడిని పుట్టిస్తున్నారు. ఇందులో భాగంగా శివసేన పార్టీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేనే మాకు సీఎంగా ఉండాలంటూ వెలిసిన ఓ బ్యానర్ మహా రాజకీయాల్లో మరింత వేడిని రాజేస్తోంది.
బాంద్రాలోని ఉద్ధవ్ ఠాక్రే నివాసం మాతో శ్రీ బయట ఈ పోస్టర్ దర్శనమిస్తోంది. ఈ పోస్టర్ లో ‘ Chief Minister of Maharashtra only Aaditya Thackeray’ అని హిందీలో రాసి ఉంది.
ఉద్ధవ్ ఠాక్రే అంటూ పోస్టర్
మహారాష్ట్రలో ఇప్పుడు అధికార ఏర్పాటు అనేది సస్పెన్స్ లో సాగుతున్న నేపథ్యంలో ఈ పరిణామం బీజేపీకి మింగుడుపడని అంశంలా మారింది. అపద్ధర్మ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సోమవారంలోగా బల నిరూపణ చేసుకోవాలని గవర్నర్ ఇప్పటికే డెడ్ లైన్ విధించారు. ఎన్నికల ఫలితాల అనంతరం అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీకి అధికారాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ రాకపోవడంతో మిత్ర పక్షం శివసేనతో అధికారాన్ని ఏర్పాటు చేయాలని అనుకుంది.
అయితే శివసేన అనుకోకుండా బీజేపీకి ఝలక్ ఇచ్చింది. 50-50 ఫార్ములాతో బీజేపీని ఇరకాటంలో పెట్టింది. దీంతో బీజేపీ అధికార ఏర్పాటు అనే ఆశలు అడుగంటాయి. చెరో రెండున్నరేళ్లు సీఎం పదవిని పంచుకుందామన్న శివసేన అభ్యర్థనను బీజేపీ అంగీకరించకపోవడంతో పంచాయితీ మరింతగా ముదిరింది.
కాగా ఎన్నికల ముందు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా తమ ఇంటికి వచ్చినపుడు ఇదే విషయంపై చర్చించామని, ఇప్పుడు సమయం ఆసన్నమైందని, ఆ ఫార్ములను అమలు చేయాలని ఉద్ధవ్ డిమాండ్ చేస్తున్నారు.