President Election 2022 Result: రాష్ట్రపతి ఎన్నికల్లో కొత్త చరిత్ర, సగానికి పైగా ఓట్లతో విజయదుంధుబి మోగించిన ద్రౌపది ముర్ము, భారత రాష్ట్రపతి పదవిని చేపట్టిన తొలి గిరిజన మహిళగా రికార్డు

భారత రాష్ట్రపతి పదవిని చేపట్టిన తొలి గిరిజన మహిళగా ద్రౌపది ముర్ము చరిత్ర సృష్టించారు. దేశ అత్యున్నత పీఠాన్ని అధిరోహించిన రెండో మహిళగా ముర్ము (NDA Presidential Candidate Droupadi Murmu) నిలిచారు

Droupadi Murmu. (Credits: ANI)

New Delhi, July 21: భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఎన్నికయ్యారు. భారత రాష్ట్రపతి పదవిని చేపట్టిన తొలి గిరిజన మహిళగా ద్రౌపది ముర్ము చరిత్ర సృష్టించారు. దేశ అత్యున్నత పీఠాన్ని అధిరోహించిన రెండో మహిళగా ముర్ము (NDA Presidential Candidate Droupadi Murmu) నిలిచారు. ఎన్డీఏ అభ్యర్థిగా రాష్ట్రపతి ఎన్నికల్లో (President Election 2022 Result) బరిలో దిగిన ద్రౌపది ముర్ము విజయ దుందుభి మోగించారు. సగానికి పైగా ఓట్లు సాధించిన ముర్ము ప్రత్యర్థి యశ్వంత్‌ సిన్హాపై భారీ మెజార్టీతో గెలుపొందారు.

ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పదవీకాలం జూలై 24తో ముగుస్తుంది. దేశానికి 15వ రాష్ట్రపతిగా గిరిజన మహిళ ద్రౌపది ముర్ము బాధ్యతలు చేపట్టబోతున్నారు. ద్రౌపది ముర్ము తన ప్రత్యర్థి యశ్వంత్ సిన్హాపై ఆధిక్యంలో ఉన్నారు. NDA అధ్యక్ష అభ్యర్థి #DroupadiMurmu మూడో రౌండ్ కౌంటింగ్ ముగిసే సమయానికి మొత్తం చెల్లుబాటు అయ్యే ఓట్లలో 50% మార్కును దాటారు. 3వ రౌండ్ లో కర్ణాటకా, కేరళ, ఎంపీ, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, ఒడిశా & పంజాబ్ రాష్ట్రాల అసెంబ్లీ ఓట్లు లెక్కించారు. ఈ రౌండ్‌లో, మొత్తం చెల్లుబాటు అయ్యే ఓట్లు 1,333. చెల్లుబాటు అయ్యే ఓట్ల మొత్తం విలువ 1,65,664. ద్రౌపది ముర్ముకు 812 ఓట్లు, యశ్వంత్ సిన్హాకు 521 ఓట్లు వచ్చాయి.

షాకింగ్ న్యూస్.. భారత్ వద్దని పౌరసత్వాన్ని వదులుకున్న 1.6 లక్షల మంది ప్రవాస భారతీయులు, గత ఐదేళ్లలో ఇదే అత్యధికం, వివరాలను వెల్లడించిన MHA

ఇక 2వ రౌండ్ తర్వాత, మొదటి 10 రాష్ట్రాల బ్యాలెట్ పేపర్ అక్షరక్రమంలో లెక్కించబడ్డాయి. ఇందులో మొత్తం చెల్లుబాటు అయ్యే ఓట్లు 1138 & వాటి మొత్తం విలువ 1,49,575. ఇందులో ద్రౌపది ముర్ముకు 809 ఓట్లు ( 1,05,299), యశ్వంత్ సిన్హాకు 329 ఓట్లు (44,276) వచ్చాయని సెక్రటరీ జనరల్, రాజ్యసభ పిసి మోడీ తెలిపారు. ఈ ఓట్లు అలాగే అంతకు మందు పార్లమెంటు ఫలితాలను కలుపుకుంటే, ఇప్పటివరకు మొత్తం 1,886 చెల్లుబాటు అయ్యే ఓట్ల విలువ 6,73,175, అందులో ద్రౌపది ముర్ముకు 1,349 ఓట్లు 4,83,299 వచ్చాయి.

అగ్రజా సెలవంటూ వెళ్లిపోయావా... ఏకధాటిగా 45 రోజుల పాటు సముద్రంలో పహారా, నౌకా దళం నుండి నిష్క్రమించిన సింధు ధ్వజ్‌ సబ్‌మెరైన్‌, ఐఎన్‌ఎస్‌ సింధు ధ్వజ్‌‌పై ప్రత్యేక కథనం

ద్రౌపది ముర్ముకు బీజేపీ, NDA భాగస్వామ్యపక్షాలతోపాటు బీజేడీ, YSR కాంగ్రెస్‌ సహా 44 పార్టీలు మద్దతిచ్చాయి. దీంతో ఆమె ఎలక్టోరల్ కాలేజ్‌లో అవసరమైన మెజార్టీకి మించి ఓట్లు సాధించారు. 63శాతం ఓట్లతో విజయ కేతనం ఎగరవేశారు. ఈ నెల 25న దేశ 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము పట్టాభిషేకం చేయనున్నారు. యశ్వంత్ సిన్హాకు 537 ఓట్లు వచ్చాయి, ఇప్పటివరకు వాటి విలువ 1,89,876గా ఉంది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్‌డిఎ అధ్యక్ష అభ్యర్థి ద్రౌపది ముర్ము విజయానికి ఇంచుమించు దగ్గరగా ఉండటంతో బిజెపి నాయకులు మరియు కార్యకర్తలు జార్ఖండ్ లోని రాంచీ రాష్ట్ర పార్టీ కార్యాలయం ముందు సంబరాలు జరుపుకున్నారు.