Murder Of Democracy In Maharashtra: పార్లమెంట్‌లో ప్రకంపనలు, ప్రజాస్వామ్యాన్ని హత్యచేశారన్న రాహుల్ గాంధీ, మహారాష్ట్ర రాజకీయాలకు వ్యతిరేకంగా పార్లమెంట్ బయట కాంగ్రెస్ పార్టీ నిరసన
బీజేపీ ఖూనీ రాజకీయాలు చేస్తుందంటే పార్లమెంటులో కాంగ్రెస్ ఆందోళన బాట(Cong Holds Protests Outside Parliament) పట్టింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా సభ ప్రారంభానికి ముందు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ (Sonia Gandhi) పార్టీ ఎంపీలతో కలిసి గాంధీ విగ్రహం వద్ద నల్ల బ్యానర్లతో నిరసనలో పాల్గొన్నారు.
New Delhi, November 25: మహారాష్ట్రలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు పార్లమెంటులో వేడిని పుట్టిస్తున్నాయి. బీజేపీ ఖూనీ రాజకీయాలు చేస్తుందంటే పార్లమెంటులో కాంగ్రెస్ ఆందోళన బాట(Cong Holds Protests Outside Parliament) పట్టింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా సభ ప్రారంభానికి ముందు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ (Sonia Gandhi) పార్టీ ఎంపీలతో కలిసి గాంధీ విగ్రహం వద్ద నల్ల బ్యానర్లతో నిరసనలో పాల్గొన్నారు. ప్రజాస్వామ్యాన్ని హత్య చేయవద్దంటూ కాంగ్రెస్ సభ్యులతో కలిసి నినాదాలు చేసారు. దీనికి యూపీఏ భాగస్వామ్య పార్టీలు మద్దతుగా నిలిచాయి.
ఉభయ సభలు సమావేశం అయిన వెంటనే కాంగ్రెస్ సభ్యులు సభలో పెద్ద ఎత్తున నినాదాలు చేసారు. లోక్ సభలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Congress leader Rahul Gandhi) మహా రాజకీయాలన వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేసారు. మహారాష్ట్రలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారంటూ మండిపడ్డారు.
లోక్ సభలో రాహుల్ గాంధీ
అటు రాజ్య సభలోనూ కాంగ్రెస్ సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. సభలో ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ సభ్యులను బయటకు పంపేందుకు మార్షల్స్ ద్వారా ప్రయత్నం జరిగింది. ఆ సమయంలో మార్షల్స్ దురుసుగా ప్రవర్తించారనే ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఉభయ సభలు ప్రారంభం కాకుండానే వాయిదా పడ్డాయి.
పార్లమెంట్ బయట నిరసన వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ
ఎవరూ ఉహించని విధంగా, అనుకోని ట్విస్టుల మధ్య దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ఎన్సీపీ నేత అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన సంగతి విదితమే. దీని పైన శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేసాయి. ఇది రాజ్యాంగ విరుద్దమంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించాయి.
ఇదిలా ఉంటే ప్రభుత్వం ఏర్పాటుచేసిన బీజేపీ, అసెంబ్లీలో బలం నిరూపించుకుంటామనే ధీమా వ్యక్తం చేసింది. తమకు 170 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ఆ పార్టీ నేతలు ప్రకటించారు. ఎన్సీపీ ఎమ్మెల్యేల మద్దతిస్తున్నట్లు గవర్నర్‌కు అజిత్ పవార్ లేఖ ఇచ్చారని బీజేపీ వెల్లడించింది.