Shatrughan Sinha: ఉద్రిక్తతల వేళ పాక్ పర్యటనలో కాంగ్రెస్ నేత, లాహోర్‌లో పాక్ అధ్యక్షుడు ఆరిప్ అల్వితో భేటీ, ఇది పూర్తిగా వ్యక్తిగత టూర్ అంటున్న బాలీవుడ్ నటుడు శత్రుఘ్న సిన్హా
మాజీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి షాట్ గన్ గా పిలుచుకొనే సినీ నటుడు శతృఘ్న సిన్హా వ్యాపారవేత్త, ఫిల్మ్ మేకర్ అయిన అసద్ అహ్ సాన్ ఆహ్వానంపై దాయాది దేశానికి వెళ్లారు. ఇంతకుముందు వివాహంలో పాల్గొనాలని అసద్ ఆహ్వానించారు.
Lahore,Febuary 23: భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు, కాంగ్రెస్ నేత శతృఘ్న సిన్హా (Shatrughan Sinha) పాకిస్థాన్‌లో (Pakistan) పర్యటించడంపై వివాదంరేగుతోంది. మాజీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి షాట్ గన్ గా పిలుచుకొనే సినీ నటుడు శతృఘ్న సిన్హా వ్యాపారవేత్త, ఫిల్మ్ మేకర్ అయిన అసద్ అహ్ సాన్ ఆహ్వానంపై దాయాది దేశానికి వెళ్లారు. ఇంతకుముందు వివాహంలో పాల్గొనాలని అసద్ ఆహ్వానించారు.
పుల్వామా దాడి అమరవీరులకు నివాళులు అర్పించిన ప్రధాని మోదీ
దీనిపై కాంగ్రెస్ నేత వివరణ ఇచ్చారు. ఇది పూర్తిగా తన పర్సనల్ టూర్ అని, రాజకీయపరమైంది మాత్రం కాదని సిన్హా ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా..సిన్హా...లాహోర్ లో అధ్యక్షుడు డాక్టర్ ఆరీఫ్ అల్వితో (Arif Alvi) భేటీ అయ్యారు. భారత్ - పాక్ దేశాల సరిహద్దులో శాంతి నెలకొల్పడంపై వీరిద్దరూ చర్చించినట్లు తెలుస్తోంది. భారత ప్రభుత్వం కాశ్మీర్ లో ఆంక్షలు విధించడం, పలువురు రాజకీయ నాయకులను నిర్బందించడంపై అల్వీ ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం.
ఇదిలా ఉంటే..పాక్, రాజకీయ సినీ ప్రముఖులతో కలిసి సిన్హా దిగిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. లాహోర్ జరిగిన వివాహ వేడుకల్లో సిన్హా పాల్గొనడంపై నెటిజన్లు బిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
Here's Shatrughan Sinha Pak Tour Tweets
భారత్-పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో శతృఘ్న సిన్హ లాహోర్‌లో జరిగిన వివాహ వేడుకలో పాల్గొనడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. పుల్వామా దాడి ఘటనకు ఏడాది పూర్తయిన సందర్భంగా అమరులైన జవాన్ల త్యాగాలను గౌరవించడం ఇదేనా అంటూ శతృఘ్నను ట్విట్టర్ వేదికగా నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.