G20 At Srinagar: నేటి నుంచి శ్రీనగర్‌లో జీ20 సమావేశాలు.. సమావేశానికి హాజరుకానున్న 60 మంది జీ20 దేశాల ప్రతినిధులు.. నగరంలో పటిష్ఠ భద్రత ఏర్పాట్లు

ఈ సమావేశాలకు పోలీసులు పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేశారు. సమావేశం జరగనున్న షేర్-ఏ-కశ్మీర్‌ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌కు వెళ్లే మార్గాలతో పాటూ నగరం మొత్తం పోలీసుల పహారాలోకి వెళ్లిపోయింది.

G20 Summit

Srinagar, May 22: జమ్ముకశ్మీర్ (Jammu Kashmir) లోని శ్రీనగర్‌లో (Srinagar) జీ20 (G20) టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశాలు నేడు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలకు పోలీసులు (Police) పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేశారు. సమావేశం జరగనున్న షేర్-ఏ-కశ్మీర్‌ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌కు వెళ్లే మార్గాలతో పాటూ నగరం మొత్తం పోలీసుల పహారాలోకి వెళ్లిపోయింది. 2019 ఆగస్టులో జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా తొలగించిన తరువాత అక్కడ జరుగుతున్న తొలి అంతర్జాతీయ సమావేశం ఇదే కావడంతో పోలీసులు, ఇతర అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది.

Dreaming Temple: నిద్రపోయినప్పుడు కలలో దేవాలయం కనిపించిందా..అయితే మీ జీవితంలో ఏం జరగబోతోందో వెంటనే తెలుసుకోండి..

Satyapal Malik Lashes Out At Centre: కేంద్రాన్ని మళ్లీ టార్గెట్ చేసిన మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్.. 2019 నాటి ఎన్నికలు భారత సైనికుల శవాలపై పోరాటమని వ్యాఖ్య.. ఇంకా ఏమన్నారంటే??

60 మంది ప్రతినిధులు..

ఈ సమావేశాల్లో జీ20 సభ్య దేశాలకు చెందిన సుమారు 60 మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. సింగపూర్‌ నుంచి అత్యధికంగా హాజరవుతారని అధికారులు తెలిపారు. జమ్ములో ఈ సమావేశాలను నిర్వహించడంపై చైనా ఇప్పటికే అభ్యంతరం చెప్పగా, సౌదీ అరేబియా ఇప్పటివరకూ సమావేశంలో పాల్గొనడంపై ఎటూ తేల్చలేదు. ఈ సమావేశానికి దూరంగానే ఉండాలని టర్కీ నిర్ణయించింది.

Rains In Hyderabad: తెల్లవారుజామున హైదరాబాద్‌లో భారీ వర్షం.. నగరంలోని పలు ప్రాంతాల్లో తెల్లవారుజామున ఉరుములు, మెరుపులతో భారీ వర్షం.. మరో రెండు మూడు గంటల్లో భారీ వర్షానికి అవకాశం ఉందన్న వాతావరణ శాఖ.. వీడియోతో