Hyderabad, May 22: ఎండలతో సతమతం అవుతున్న హైదరాబాదీలకు (Hyderabadies) వరుణుడు కాస్త సాంత్వన కలిగించాడు. సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్‌లో (Hyderabad) భారీ వర్షం (Heavy Rain) కురిసింది. అమీర్‌పేట (Ameerpet), పంజాగుట్ట (Punjagutta), బంజారాహిల్స్ తో పాటూ పలుచోట్ల ఉరుములు (Thunderstorms), మెరుపులతో వర్షం కురిసింది. చాంద్రాయణగుట్ట, శాంలిబండలో ఈ తెల్లవారుజామున కురిసిన వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. రాజేంద్రనగర్‌లో 4.6 సెంటీమీటర్ల వర్షం పాతం నమోదు కాగా, అంబర్‌పేట, శేరిలింగంపల్లి, శివరాంపల్లిలో 3.9 సెం.మీ చొప్పున వర్షంపాతం నమోదైంది. హఠాత్తుగా కురిసిన వర్షంతో పలుప్రాంతాలు జలదిగ్బంధనంలో చిక్కుకున్నాయి. వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హైదరాబాద్‌తో పాటూ నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లోని పలుప్రాంతాల్లోనూ వర్షం కురిసింది.
కొద్ది గంటల్లో ఈ ప్రాంతాల్లో..
రానున్న కొద్ది గంటల్లో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.