Newdelhi, May 22: జమ్ముకశ్మీర్ (Jammukashmir) మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ (Satyapal Malik) మరోసారి కేంద్ర ప్రభుత్వంపై (Central Government) విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. పుల్వామా (Pulwama) ఉగ్రదాడిని మరోమారు గుర్తు చేసిన ఆయన.. 2019 నాటి ఎన్నికలు భారత సైనికుల శవాలపై పోరాటమేనని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల పోరు సైనికుల శవాలపై జరిగిందన్న మాలిక్ ఈ ఘటనపై ఎలాంటి దర్యాప్తు జరగలేదని చెప్పారు. విచారణ జరిగి ఉంటే అప్పటి హోం మంత్రి రాజీనామా చేయాల్సి వచ్చేదని పేర్కొన్నారు. అనేక మంది అధికారులు జైలు పాలయ్యే వారని, ఈ ఉదంతం పెద్ద వివాదాస్పదం అయ్యేదని తెలిపారు.
Jaipur: Former Jammu and Kashmir governor Satyapal Malik Sunday again attacked the government over the Pulwama attack issue, saying the 2019 Lok Sabha elections were “fought on the bodies of our soldiers”, and the then home minster would have to resign had there been a probe into pic.twitter.com/8NvufFCNy9
— Deccan News (@Deccan_Cable) May 22, 2023
ఇంకా ఆయన ఏమన్నారంటే?
‘ఉగ్రదాడి జరిగిన రోజున ప్రధాని మోదీ జిమ్‌కార్బెట్ నేషనల్ పార్కులో షూటింగ్‌లో ఉన్నారు. ఆయన పార్కు నుంచి బయటకు రాగానే నేను ఫోన్ చేశాను. మన పొరపాటు వల్ల సైనికులు మరణించారని చెప్పాను. దీంతో, ఆయన నాకు మౌనంగా ఉండమని చెప్పారు’ అని సత్యపాల్ మాలిక్ వెల్లడించారు.