Tamil Nadu Politics: తమిళనాడులో బీజేపీకి భారీ షాక్, కాషాయన్ని వీడి AIADMK తీర్థం పుచుకున్న 13 మంది నేతలు, అందరూ ఐటీ వింగ్‌కు చెందినవారే..

ఆ పార్టీకి చెందిన 13 మంది కీలక నేతలు ఇవాళ పార్టీకి గుడ్‌బై (Bjp Leader Quits) చెప్పారు. వాళ్లంతా బీజేపీని వీడి దాని మిత్రపక్షమైన అన్నా డీఎంకేలోనే చేరారు

Nirmal Kumar and palaniswami (Photo-Twitter)

Chennai, Mar 8: తమిళనాడులో బీజేపీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన 13 మంది కీలక నేతలు ఇవాళ పార్టీకి గుడ్‌బై (Bjp Leader Quits) చెప్పారు. వాళ్లంతా బీజేపీని వీడి దాని మిత్రపక్షమైన అన్నా డీఎంకేలోనే చేరారు. మాజీ సీఎం పళనిస్వామి నేతృత్వంలోని అన్నాడీఎంకే (AIADMK) తమ పార్టీ నేతలకు ఎర వేస్తున్నదని ఓ వైపు బీజేపీ ఆరోపిస్తుండగానే తాజా పరిణామం చోటుచేసుకున్నది.

భారత సైనికులు చైనా ఫోన్లు వాడవద్దు, రక్షణ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ హెచ్చరిక, చైనా సీసీ కెమెరాలను దేశంలో నిషేధించాలని అరుణాచల్ ఎమ్మెల్యే ఐరింగ్ డిమాండ్

ఇవాళ బీజేపీని వీడిన 13 మంది నేతలు (13 Leaders Quit Party) పశ్చిమ చెన్నైలోని ఐటీ విభాగానికి చెందినవారు. తాను బీజేపీ కోసం ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్నానని, ఎలాంటి పదవులను ఆశించలేదని, అయితే పార్టీలో గత కొన్ని రోజులుగా చోటుచేసుకుంటున్న పరిణామాలు తనను పార్టీని వీడేలా చేశాయని బీజేపీ ఐటీ వింగ్‌ జిల్లా అధ్యక్షుడు అంబరాజన్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

కాగా, అంబరాజన్‌తోపాటు ఇవాళ బీజేపీని వీడిన వారిలో 10 మంది ఐటీ వింగ్‌ జిల్లా కార్యదర్శులు, ఇద్దరు ఐటీ వింగ్‌ డిప్యూటీ కార్యదర్శులు ఉన్నారు. అంతకుమునుపే బీజేపీ ఇంటెలెక్చువల్‌ వింగ్‌ రాష్ట్ర కార్యదర్శి కృష్ణన్‌, ఐటీ వింగ్‌ రాష్ట్ర కార్యదర్శి దిలీప్‌ కన్నన్‌, తిరుచ్చి రూరల్‌ జిల్లా ఉపాధ్యక్షుడు విజయ్‌, రాష్ట్ర ఓబీసీ వింగ్ కార్యదర్శి అమ్ము అన్నాడీఎంకేలో జాయిన్‌ అయ్యారు.