Mamata Banerjee on UPA: ఇంకెక్కడి యూపీఏ, అదంతా గడిచిన చరిత్ర, యూపీఏపై మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు, శరద్ పవార్‌తో దీదీ కీలక భేటీ
కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ(UPA) కూటమిపై సంచలన వ్యాఖ్యలు చేశారు టీఎంసీ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ(Mamata Benerjee). అసలు యూపీఏ ఎక్కడుంది? యూపీఏ అనేది ఇక నుంచి ఒక చరిత్ర లాంటిది, అన్నారు. ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్(Sharad Pawar)తో భేటీ అనంతరం దీదీ ఈ వ్యాఖ్యలు చేశారు.
Mumbai December 02: కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ(UPA) కూటమిపై సంచలన వ్యాఖ్యలు చేశారు టీఎంసీ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ(Mamata Benerjee). అసలు యూపీఏ ఎక్కడుంది? యూపీఏ అనేది ఇక నుంచి ఒక చరిత్ర లాంటిది, అన్నారు. ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్(Sharad Pawar)తో భేటీ అనంతరం దీదీ ఈ వ్యాఖ్యలు చేశారు.
వరుస పర్యటనలు, విపక్ష నేతల భేటీలు, పార్టీలో చేరికలతో జోష్ మీదున్నారు మమతా బెనర్జీ(Mamata Benerjee). మూడు రోజుల పర్యటన నిమిత్తం ఆమె ముంబైకి వచ్చారు. అక్కడ ఎన్సీపీ అధినేత శరద్ పవార్(Sharad Pawar)తో భేటీ అయ్యారు. దేశంలో ప్రస్తుతం సాగుతున్న ఫాసిజానికి వ్యతిరేకంగా బలమైన మార్గాన్ని అనుసరించాలని చెప్పారు. ఈ విషయంలో శరద్ పవార్ అభిప్రాయాలతో తాను ఏకీభవిస్తున్నానని అన్నారు. పవార్‌తో సమావేశం అనతరం జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా యూపీఏలో చేరతారా? అని జర్నలిస్టులు ప్రశ్నించారు. దీనికి బదులిచ్చిన ఆమె.. ‘ప్రస్తుతం దేశంలో యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలియన్స్(UPA) అసలు లేనే లేదు’ అని స్పష్టం చేశారు.
తాను మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే(Uddav Thackrey), శరద్ పవార్ ఇద్దరినీ కలిసేందుకే ముంబై వచ్చానని, కానీ ఉద్ధవ్ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఆయన్ను కలవలేకపోయానన్నారు. ఉద్ధవ్ లేకపోవడంతో శివసేన నేతలు ఆదిత్య థాక్రే(Adithya Thackrey), సంజయ్ రౌత్(Sanjay Raut)తో ఆమె సమావేశమయ్యారు.
A firm alternative course should be made as nobody's fighting against ongoing fascism. Sharad Ji is the seniormost leader & I came to discuss our political parties. I agree with whatever Sharad Ji said. There is no UPA: WB CM Mamata Banerjee after meeting NCP Chief Sharad Pawar pic.twitter.com/P2GdlA9JlA
— ANI (@ANI) December 1, 2021
ఇప్పటికే పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేతలు వరుసగా టీఎంసీలో చేరుతున్నారు. కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలిగా గతంలో పని చేసిన సుస్మితా దేవ్(Susmitha Dev), గోవా మాజీ సీఎంతో పాటూ, కీర్తి ఆజాద్ వంటి వారు టీఎంసీలో చేరారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వం వహిస్తున్న యూపీఏపై దీదీ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి. భావసారుప్యత కలిగిన పార్టీలను తాను కలుపుకొని వెళ్తానని ఇప్పటికే దీదీ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో మరికొందరు విపక్ష నేతలతో త్వరలోనే భేటీ అయ్యే అవకాశముంది.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)