IPL Auction 2025 Live

Tripura Assembly Elections 2023: త్రిపురలో కొనసాగుతున్న పోలింగ్, మార్చి 2న తేలనున్న 259 మంది అభ్యర్థుల భవితవ్యం, తిప్రా మోతా రాకతో వేడెక్కిన పోటీ

గురువారం ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్‌ ప్రారంభమైంది. మధ్యాహ్నం నాలుగు గంటల వరకు 3,337 పోలింగ్‌ కేంద్రాల్లో 60 శాసనసభ స్థానాలకు (Tripura Assembly Elections 2023) పోలింగ్‌ జరగనుంది.మొత్తం 259 మంది అభ్యర్థుల భవితవ్యం ఖరారైంది.

Tripura Assembly Elections 2023 (Photo Credit: ANI)

ఈశాన్య రాష్ట్రం త్రిపురలో పోలింగ్ మొదలైంది. గురువారం ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్‌ ప్రారంభమైంది. మధ్యాహ్నం నాలుగు గంటల వరకు 3,337 పోలింగ్‌ కేంద్రాల్లో 60 శాసనసభ స్థానాలకు (Tripura Assembly Elections 2023) పోలింగ్‌ జరగనుంది.మొత్తం 259 మంది అభ్యర్థుల భవితవ్యం ఖరారైంది. 13.53 లక్షల మహిళాఓటర్లుసహా మొత్తం 28.13 లక్షల మంది ఓటర్లు ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. స్వేచ్ఛగా, పారదర్శకంగా, ప్రశాంతంగా పోలింగ్‌ జరిగేలా అనిఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌(సీఈఓ) గిట్టే కిరణ్‌కుమార్‌ దినకరో చెప్పారు.మార్చి రెండో తేదీన ఓట్లు లెక్కిస్తారు.

పోలింగ్‌ కేంద్రాల్లో 1,100 కేంద్రాలు సున్నితమైన ప్రాంతాల్లో ఉండగా 28 సమస్యాత్మక ప్రాంతాల్లో ఉన్నాయి. పోలింగ్‌ కేంద్రాల్లో కలిపి మొత్తంగా 31వేల పోలింగ్‌ సిబ్బంది, 25వేల కేంద్ర భద్రతా బలగాలు, 31వేల రాష్ట్ర పోలీసు బలగాలు విధుల్లో కొనసాగనున్నాయి’ అని సీఈఓ చెప్పారు.అన్ని ముందస్తు చర్యల్లో భాగంగా 17వ తేదీ ఉదయందాకా నిషేధాజ్ఞలు అమల్లోకి తెచ్చాం. అంతరాష్ట్ర, అంతర్జాతీయ సరిహద్దులను మూసేశాం’ అని సీనియర్‌ పోలీస్‌ ఉన్నతాధికారి చెప్పారు.

బాలికలకు రుతుస్రావం సెలవులు ఇవ్వాలని సుప్రీంకోర్టులో పిల్, ఫిబ్రవరి 24 తర్వాత విచారణకు స్వీకరిస్తామని తెలిపిన CJI DY చంద్రచూడ్

ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌ కోసం ఉద్యమం చేసి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తిప్రా మోతా రాకతో ఈసారి రాష్ట్రంలో త్రిముఖ పోరు కనిపిస్తోంది. బీజేపీ–ఐపీఎఫ్‌టీ కూటమి, సీపీఐ(ఎం)–కాంగ్రెస్‌ కూటమి, తిప్రా మోతాల మధ్యే అసలు పోరు మొదలు కానుందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.

ముఖ్యమంత్రి, బీజేపీ అభ్యర్థి మాణిక్‌ సాహా ఈసారి బర్దోవాలీ నుంచి బరిలో నిలిచారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జితేంద్ర చౌదరి సాబ్రూమ్‌ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్నారు. తిప్రా మోతా చైర్మన్‌ ప్రద్యోత్‌ దేబ్‌ బర్మన్‌ ఈసారి పోటీచేయడంలేదు. బీజేపీ 55 చోట్ల తన అభ్యర్థులను బరిలో నిలిపింది. బీజేపీ కూటమి పార్టీ ఐపీఎఫ్‌టీ ఆరు స్థానాల్లో పోటీచేస్తోంది. ఈ రెండు పార్టీలూ ఒక స్థానంలో స్నేహపూర్వక పోటీకి సిద్దమయ్యాయి.

సెట్‌టాప్‌ బాక్స్‌ అవసరం లేకుండా 200 చానల్స్‌ చూడొచ్చు, టీవీల్లో శాటిలైట్‌ ట్యూనర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపిన అనురాగ్ ఠాకూర్

సీపీఎం 47 చోట్ల, కాంగ్రెస్‌ 13 చోట్ల, తిప్రా మోతా 42 చోట్ల అభ్యర్థులను నిలబెట్టాయి. గత ఐదేళ్లపాలనలో తాము చేసిన అభివృద్ధినే ఎన్నికల అజెండాగా బీజేపీ ప్రచారంచేయగా, దుష్ప్రరిపాలన అంటూ లెఫ్ట్‌ ఫ్రంట్, కాంగ్రెస్‌లు విమర్శిస్తూ ప్రచారంచేయడం తెల్సిందే. గ్రేటర్‌ తిప్రాల్యాండ్‌ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా తిప్రా మోతా ఎన్నికల బరిలో దిగింది.



సంబంధిత వార్తలు