Union Information and Broadcasting Minister Anurag Thakur (Photo/ANI)

New Delhi, Feb 15: టీవీల్లో తయారీ సమయంలోనే శాటిలైట్‌ ట్యూనర్లు (Inbuilt TV Satellite Tuners) ఏర్పాటు చేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ (Union minister Anurag Thakur) తెలిపారు. దీంతో సెట్‌టాప్‌ బాక్స్‌ అవసరం లేకుండానే ఉచితంగా 200 చానల్స్‌ వరకు వీక్షించే అవకాశం ఏర్పడుతుందన్నారు.

టీవీల్లో శాటిలైట్‌ ట్యూనర్లను ఏర్పాటు చేయడం వల్ల ఉచిత టీవీ చానళ్లను చూడడానికి వీలవుతుంది.ఫ్రీ డిష్‌లో సాధారణ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్‌ల భారీ విస్తరణ జరిగిందని, ఇది కోట్లాది మంది వీక్షకులను ఆకర్షించడంలో దోహదపడిందని ఆయన అన్నారు.అయితే ఈ విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని మంత్రి స్పష్టం చేశారు.

బీబీసీ కార్యాలయాల్లో ఆదాయపు పన్ను అధికారులు సోదాలు, పన్ను ఎగవేత ఆరోపణల దర్యాప్తులో భాగంగానే సర్వే నిర్వహించిందని తెలిపిన ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా

రేడియో చానళ్ల ప్రసారాలను కూడా వినొచ్చు. విండో వద్ద లేదంటే మేడ పైన చిన్న యాంటెన్నా ఏర్పాటు చేసుకుంటే సరిపోతుంది. ఇందుకు సంబంధించి నిర్ణయాన్ని ఇంకా తీసుకోవాల్సి ఉన్నట్టు మంత్రి అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్‌ చెప్పారు. టీవీల్లో ఇన్‌బిల్ట్‌గా శాటిలైట్‌ ట్యూనర్ల విషయంలో ఆదేశాలు జారీ చేయాలంటూ టెలికం మంత్రి అశ్వని వైష్ణవ్‌కు గత డిసెంబర్‌లో అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్‌ లేఖ కూడా రాయడం గమనార్హం.