Shiv Sena Row: సుప్రీంకోర్టుకు చేరిన శివసేన పంచాయితీ, ఏక్‌నాథ్ షిండే వర్గంపై స్పీకర్ అనర్హత వేటు వేయకపోవడాన్ని సుప్రీంలో సవాల్ చేసిన ఉద్ధవ్ సేన

ఏక్‌నాథ్ షిండేపై అనర్హత వేటు వేయడానికి మహారాష్ట్ర స్పీకర్ నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ ఉద్ధవ్ సేన సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

uddhav-Thackeray (credit- fb , PTI

Mumbai, Jan 15: ఏక్‌నాథ్ షిండే గ్రూపును నిజమైన శివసేనగా (Shiv Sena) గుర్తిస్తూ, రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ప్రకారం ఫిరాయింపులకు పాల్పడినందుకు షిండే వర్గానికి చెందిన సభ్యులను అనర్హులుగా ప్రకటించడాన్ని నిరాకరిస్తూ మహారాష్ట్ర స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఏక్‌నాథ్ షిండే, ఆయన మద్దతు ఎమ్మెల్యేలపై (Eknath Shinde Group) అనర్హత వేటు వేయాలని కోరుతూ ఉద్ధవ్ వర్గం దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరిస్తూ స్పీకర్ రాహుల్ నార్వేకర్ జనవరి 10న తీర్పు వెలువరించారు. ఉద్ధవ్ గ్రూపుపై షిండే వర్గం దాఖలు చేసిన అనర్హత పిటిషన్లను కూడా స్పీకర్ తోసిపుచ్చారు.

తాజాగా స్పీకర్‌ ఇచ్చిన రూలింగ్‌పై తాజాగా ఉద్ధవ్‌ థాక్రే (Uddhav Thackeray Sena) సుప్రీంకోర్టుకు వెళ్లారు. దీంతో పాటు పార్టీ వీడి షిండేతో పాటు వేరు కుంపట్టి పెట్టిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయకపోవడాన్ని కూడా ఉద్ధవ్‌ సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు.

శివసేన సింబల్ వివాదం, షిండే వర్గానికి నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు, ఈసీ ఆదేశాలపై స్టేకు నిరాకరించిన అత్యున్నత ధర్మాసనం

జూన్‌ 2022లో పార్టీ రెండుగా చీలిపోయిన తర్వాత రెండు శివసేన వర్గాలు ఒకరిపై ఒకరు స్పీకర్‌కు అనర్హత పిటిషన్‌లు ఇచ్చారు. షిండేతో పాటు వెళ్లిన మొత్తం 40 మంది ఎమ్మెల్యేలపైనా ఉద్ధవ్‌ వర్గం అనర్హత పిటిషన్‌లు వేయగా ఉద్ధవ్‌ వర్గంలోని 14 మంది ఎమ్మెల్యేలపై షిండే వర్గం అనర్హత పిటిషన్‌లు ఇచ్చింది. షిండే నేతృత్వంలోని పార్టీయే అసలైన శివసేన అని గుర్తిస్తూ ధనుస్సు బాణం గుర్తును ఎన్నికల కమిషన్ గతేడాది వారికే కేటాయించడం గమనార్హం.

మా నుంచి అన్నీ దొంగిలించినా ఠాక్రే పేరును మాత్రం దొంగిలించలేరు, మహారాష్ట్రలో ప్రస్తుత పరిస్థితి ఆపకపోతే ఇవే చివరి ఎన్నికలంటూ ఆందోళన వ్యక్తం చేసిన ఉద్ధవ్ థాకరే

కాగా రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్‌లో ఉన్న పిటిషన్‌లను స్పీకర్ నిర్ణయించడానికి సుప్రీంకోర్టు మొదట డిసెంబర్ 31, 2023 వరకు గడువు విధించింది; తర్వాత కోర్టు గడువును జనవరి 10, 2024 వరకు పొడిగించింది . " ఈ కోర్టు తీర్పు గౌరవాన్ని కాపాడాలి" అని గమనించి, తీర్పులో స్పీకర్ ఆలస్యం చేయడంపై SC తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది.