IPL Auction 2025 Live

Karnataka CM Yediyurappa: వారి అండ ఉన్నంత వరకు నేనే ముఖ్యమంత్రిని, అసెంబ్లీ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేసిన కర్ణాటక సీఎం బి.ఎస్.యడ్యూరప్ప, ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా తోడుగా ఉంటారని వెల్లడి

గత కొంతకాలంగా సీఎం మార్పుపై వస్తున్న వార్తలను ఆయన ఖండించారు.

BS Yediyurappa | File Image | (Photo Credits: PTI)

Bengaluru, Feb 6: కర్ణాటక ముఖ్యమంత్రి బి.ఎస్.యడ్యూరప్ప ముఖ్యమంత్రి మార్పుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన పదవి ఊడిపోతుందంటూ వస్తున్న ఊహాగానాలకు అసెంబ్లీ వేదికగా ఆయన (Karnataka CM Yediyurappa) గట్టిగానే సమాధానం ఇచ్చారు. తనను ముఖ్యమంత్రి పదవి నుంచి ఎవరూ దింపలేరని (No One Can Dislodge Him As Karnataka CM) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అండ తనకు ఉన్నంతవరకూ తనను ఎవరూ ఏమీ చేయలేరని స్పష్టం చేశారు. గత కొంతకాలంగా సీఎం మార్పుపై వస్తున్న వార్తలను ఆయన ఖండించారు.

కొందరు నేతలు పగటి కలలు కంటూ కర్ణాటకలో తనను సీఎం పదవి నుంచి తప్పిస్తారని రోజూ ప్రకటనలు గుప్పిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం సందర్భంగా ఈ విషయంపై యడియూరప్ప పై వ్యాఖ్యలు చేశారు. కాగా ఉగాది తర్వాత ఏప్రిల్‌ 13వ తేదీన కొత్త ముఖ్యమంత్రి బాధ్యతలు చేపడతారని బీజేపీ సీనియర్‌ ఎమ్మెల్యే బసవనగౌడ పాటిల్‌ ఇటీవల ప్రకటన చేశాడు.

రైతులకు దారుణమైన అన్యాయం జరుగుతోంది, కేంద్రానికి లేఖ రాసిన 75 మంది మాజీ సివిల్‌ సర్వెంట్ల బృందం, రైతులకు మద్దతు ఇస్తున్నట్లు స్పష్టం, సమస్యను వెంటనే పరిష్కరించాలని కేంద్రానికి సూచన

ఆయనతోపాటు మరికొందరు నాయకులు ఇలాంటి ప్రకటనలు చేస్తుండడంతో బి.ఎస్.యడ్యూరప్ప అసెంబ్లీ వేదికగా వారికి జవాబిచ్చారు. అమిత్‌ షా తన వెన్నంటి ఉన్నంత వరకూ తాను న్యాయ పోరాటాలన్నింటినీ దీటుగా ఎదుర్కొని బయటకు వస్తానని ధీమా వ్యక్తం చేశారు. వంద కేసులైనా ఎదుర్కొనేందుకు తాను సిద్ధమని ప్రకటించారు. ప్రధానమంత్రి మోదీ, అమిత్‌ షాలకు తనపై విశ్వాసం ఉందని, తనను ఎవరూ ఏమీ చేయలేరని కర్ణాటక సీఎం పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే కర్నాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయిన తరువాత ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి అక్కడ అసంతృప్త జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. 2019 జూలైలో యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో పార్టీలోని సీనియర్‌ నాయకులు సీఎం మార్పుపై ప్రశ్నిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.