No Confidence Motion: మీ కుటుంబపాలనలో దేశం చాలా నాశనమైంది, మీ అవినీతి పాలనకు వ్యతిరేకంగా మరోసారి క్విట్ ఇండియా అంటూ నినదించాలి, రాహుల్ గాంధీపై ధ్వజమెత్తిన బీజేపీ ఎంపీ స్మృతి ఇరానీ
మణిపూర్ విభజించబడలేదు.. ఒక్కటిగానే ఉందన్నారు. ఆయన మణిపూర్లో భారత మాత చంపబడిందని అన్నారు. దానికి వారి మద్దతుదారులంతా చప్పట్లు కూడా కొట్టారు. కుటుంబపాలనలో దేశం చాలా నాశనమైంది.
New Delhi, August 9: అవిశ్వాస తీర్మానంపై ప్రసంగిస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మణిపూర్ అల్లర్ల నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వంపైనా, ప్రధానిపైనా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఆయన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అంతేస్థాయిలో తిప్పికొట్టారు. మీరసలు భారత దేశానికి చెందినవారే కాదన్నారు. మణిపూర్ విభజించబడలేదు.. ఒక్కటిగానే ఉందన్నారు. ఆయన మణిపూర్లో భారత మాత చంపబడిందని అన్నారు. దానికి వారి మద్దతుదారులంతా చప్పట్లు కూడా కొట్టారు. కుటుంబపాలనలో దేశం చాలా నాశనమైంది.
అందుకే కుటుంబపాలను స్వస్తి పలకాలి. అవినీతికి స్వస్తి పలకాలి అన్నారు. మీరనుకునే ఇండియా కాదిది. అవినీతి రహిత ఇండియా. ఇక్కడ కుటుంబపాలనకు చోటు లేదన్నారు. అసలు మీరు ఇండియాకు చెందిన వారే కాదన్నారు. దేశం రాజవంశాన్ని కాదు మెరిట్‌ను నమ్ముతుందని అన్నారు. నాడు బ్రిటీషు వారికి వ్యతిరేకంగా నినదించినట్లు ఇప్పుడు మీ కుటుంబ పాలనకు,అవినీతి పాలనకు వ్యతిరేకంగా మరోసారి క్విట్ ఇండియా అంటూ నినదించాలన్నారు.