IPL Auction 2025 Live

YSR Jayanthi: దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి 75వ జయంతి నేడు.. వైఎస్‌ విజయమ్మ, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్‌ భారతి నివాళులు

ఈ నేపథ్యంలో వైఎస్సార్‌ జిల్లాలోని ఇడుపులపాయలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఘాట్‌ వద్ద వైఎస్‌ విజయమ్మ, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్‌ భారతి నివాళులు అర్పించారు.

Vijayamma, Jagan (Credits: X)

Hyderabad, July 8: దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి (YS Rajashekharreddy) 75వ జయంతి నేడు. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌ జిల్లాలోని ఇడుపులపాయలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఘాట్‌ వద్ద వైఎస్‌ విజయమ్మ, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్‌ భారతి నివాళులు అర్పించారు. ఈ క్రమంలో విజయమ్మ కంటతడి పెట్టుకోగా, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. తండ్రిని తలచుకొంటూ జగన్ ఎక్స్‌ (ట్విటర్) వేదికగా ఎమోషనల్‌ ట్వీట్‌ చేశారు.

ఉచిత ఇసుక పాల‌సీ అమ‌లుకు రంగం సిద్ధం, ట‌న్నుకు రూ. 88 వ‌సూలు చేయ‌నున్న ప్ర‌భుత్వం

ట్వీట్ ఇది..

'నాన్నా మీ 75వ పుట్టినరోజు మా అందరికీ పండుగ రోజు. కోట్లాది కుటుంబాలు ఇవాళ మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాయి. వైయస్సార్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు మీ పుట్టినరోజున సేవా కార్యక్రమాల్లో ముందుకు సాగుతున్నారు. ప్రజా శ్రేయస్సుకోసం మీరు చూపిన మార్గం  మాకు శిరోధార్యం.జీవితాంతం మీరు పాటించిన క్రమశిక్షణ, చేసిన కఠోర శ్రమ, రాజకీయాల్లో మీరు చూపిన ధైర్యసాహసాలు మాకు మార్గం.  మీ ఆశయాల సాధనే లక్ష్యంగా, కోట్లాది కుటుంబాల క్షేమమే ధ్యేయంగా… చివరివరకూ మా కృషి.’ అంటూ వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.

విభ‌జ‌న స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం క‌మిటీలు, సీఎస్ ల‌తో పాటూ అధికారుల‌తో క‌మిటీలు ఏర్పాటు, అక్క‌డ కూడా ప‌రిష్కారం కాక‌పోతే ముఖ్య‌మంత్రుల‌దే తుది నిర్ణయం