Representational Image (Photo Credits: Pexels)

Vijayawada, Jan 27: వైఎస్ఆర్ జిల్లాలోని (YSR District) దువ్వూరు మండలం గుడిపాడు గ్రామం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Road Accidents) చోటుచేసుకుంది. డివైడర్‌ ను ఢీకొని ఓ ప్రైవేటు బస్సు బోల్తాపడింది. ఈ ఘటనలో 15 మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్‌ నుంచి చిత్తూరుకు బస్సు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది.

పిల్లల పెండ్లికి పెద్దలు అంగీకరించకుంటే.. ఆత్మహత్యకు ప్రేరేపించినట్టు ఏమీ కాదు.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Here's Video:

ప్రైవేటు పాఠశాల బస్సు బోల్తా

సత్యసాయి జిల్లా గుమ్మఘట్ట మండలంలోని గోనబావి క్రాస్‌ సమీపంలో స్థానిక పాఠశాలకు చెందిన ఓ బస్సు అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో నలుగురు విద్యార్థులు స్వల్పగాయాలతో బయటపడ్డారు.

హుస్సేన్ సాగర్‌లో భారీ అగ్నిప్రమాదం, మంటల్లో రెండు బోట్లు, ప్రమాద సమయంలో బోట్స్‌లో 15 మంది