Newdelhi, Jan 27: పెద్దలు తమ ప్రేమను ఒప్పుకోలేదని సూసైడ్ (Suicide) చేసుకుంటున్న వారి సంఖ్య ఇటీవలి కాలంలో ఎక్కువైంది. ఈ క్రమంలో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. వివాహం చేసుకోవడానికి పెద్దలు అంగీకరించకపోవడం ఆత్మహత్యకు ప్రేరేపించడం కిందకు రాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఓ మహిళ.. తన కుమారుడితో ప్రేమలో ఉన్న యువతిని ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించారంటూ దాఖలైన అభియోగాలను కోర్టు ఈ మేరకు కొట్టేసింది. భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ)లోని సెక్షన్ 306 ప్రకారం.. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రేమ వివాహాన్ని వ్యతిరేకించడం ఆత్మహత్యకు ప్రేరేపించినట్లుగా పరిగణించబడదని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా పేర్కొంది.
హుస్సేన్ సాగర్‌లో భారీ అగ్నిప్రమాదం, మంటల్లో రెండు బోట్లు, ప్రమాద సమయంలో బోట్స్‌లో 15 మంది
అసలేం జరిగిందంటే?
ఆత్మహత్యతో మరణించిన యువతి, పెళ్లిని వ్యతిరేకించిన అబ్బాయి తల్లికి మధ్య వివాదాల తలెత్తాయి. అబ్బాయి తల్లి వివాహాన్ని వ్యతిరేకించిందని, తన కొడుకు ప్రేమించిన అమ్మాయిపై "అవమానకరమైన" వ్యాఖ్యలు చేశారని అభియోగాలు వచ్చాయి. ఛార్జిషీట్, సాక్షుల స్టేట్‌మెంట్‌లతో సహా రికార్డులో ఉన్న అన్ని సాక్ష్యాలు సరైనవని తీసుకున్నప్పటికీ, అప్పీలుదారుకు వ్యతిరేకంగా చిన్న సాక్ష్యం కూడా లేదని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. ఐపీసీ 306 ప్రకారం.. ఇది ఆత్మహత్యకు ప్రేరేపించడం కిందకు రాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.