Rahul Gandhi: బిజీగా ఉండే రాహుల్ గాంధీ బ్యాట్ పట్టాడు, నేను కొడితే సిక్స్ అని అంటున్నాడు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రాహుల్ గాంధీ క్రికెట్ వీడియో, హర్యానా ఎన్నికల్లో ప్రధానిపై విమర్శలు
హర్యానాలోని రేవారిలో విద్యార్థులతో కలిసి క్రికెట్ ఆడారు.
New Delhi, October 18: రాజకీయాల్లో నిత్యం బిజీగా ఉండే కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ సరదాగా బ్యాట్ పట్టారు. హర్యానాలోని రేవారిలో విద్యార్థులతో కలిసి క్రికెట్ ఆడారు. రాహుల్ గాంధీ హర్యానా ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగా ఆయన హెలికాప్టర్ సాంకేతిక సమస్యలతో ఆగిపోయింది. హరియాణలోని మహెందర్‌ఘర్ ఎన్నికల సభలో పాల్గొన్న రాహుల్ ఢిల్లీకి తిరిగి వెళ్తున్న క్రమంలో ఈఘటన చోటుచేసుకుంది. దట్టమైన దుమ్ము తుపాను ఏర్పడటంతో హెలీకాప్టర్‌ను రివారీలోని కేఎల్పీ కాలేజీ మైదానంలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఈ ఘటన అనంతరం రాహుల్ రోడ్డు మార్గాన ఢిల్లీ చేరుకన్నారు.
ఆ కాసేపు మయంలో అక్కడ క్రికెట్ ఆడుతున్న విద్యార్థుల వద్దకు రాహుల్ చేరుకుని వారితో క్రికెట్ ఆడారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
క్రికెట్ ఆడుతున్న కాంగ్రెస్ యువనేత
దీనికి సంబంధించిన వీడియోను ఏఎన్‌ఐ వార్తా సంస్థ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఇక ఈ నెల 21న హరియాణ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. మాహేంద్రగర్ బీజేపీ తరపున రామ్‌విలాస్‌శర్మ పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ తరపున రావు దాన్ సింగ్ బరిలో నిలిచారు. దుమ్ము తుపాను కారణంగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 60 విమానాలు 35 నిముషాల ఆలస్యంగా నడిచాయి.
ప్రధాని మోడీకి ఆర్థిక వ్యవస్థ అంటే ఏంటో తెలియదు: రాహుల్ గాంధీ
ప్రధాని నరేంద్ర మోదీకి అసలు ఆర్థిక వ్యవస్థ అంటేనే తెలియదని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. 2003 నుంచి 2014 వరకు ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందడానికి ఉపాధి హామీ, రైతు రుణమాఫీలే కారణమని అమెరికా ఆర్థికవేత్తలు తనతో చెప్పారన్నారు. హర్యానా ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ ఈ విమర్శలు చేశారు.