'Sanjeevani' Buses in AP: అరగంటలోనే కరోనా టెస్ట్ ఫలితం, ఏపీలో సిద్ధమైన సంజీవని వాహనాలు, అన్ని జిల్లాలకు అందుబాటులో.., ప్రారంభించిన పర్యాటక శాఖా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు

ల్యాబ్‌లకు తోడు కొత్తగా సంజీవని వాహనాలను ('Sanjeevani' Buses in AP) ఏర్పాటు చేసింది. దీంతో అరగంటలోనే కరోనా టెస్టుల ఫలితం రానుంది. ఆర్టీసీ బస్సులను సంజీవని వాహనాలుగా మార్చి ఏపీలోని అన్ని జిల్లాలకు చేరవేశారు. విశాఖపట్నం జిల్లాలో ఐదు సంజీవని వాహనాలు (COVID-19 Sample Testing Buses) అందుబాటులోకి వచ్చాయి. బస్సుకు రెండు వైపుల నుంచి ఒకేసారి పదిమంది నమూనాలు సేకరించవచ్చు.

Visakhapatnam district gets five 'Sanjeevani' buses (Photo-Twitter)

Vijaywada, July 17: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా నియంత్రణకు జగన్ సర్కారు టెస్టుల సంఖ్యను పెంచింది. ల్యాబ్‌లకు తోడు కొత్తగా సంజీవని వాహనాలను ('Sanjeevani' Buses in AP) ఏర్పాటు చేసింది. దీంతో అరగంటలోనే కరోనా టెస్టుల ఫలితం రానుంది. ఆర్టీసీ బస్సులను సంజీవని వాహనాలుగా మార్చి ఏపీలోని అన్ని జిల్లాలకు చేరవేశారు. విశాఖపట్నం జిల్లాలో ఐదు సంజీవని వాహనాలు (COVID-19 Sample Testing Buses) అందుబాటులోకి వచ్చాయి. బస్సుకు రెండు వైపుల నుంచి ఒకేసారి పదిమంది నమూనాలు సేకరించవచ్చు. ఏపీలో 40 వేలు దాటిన కరోనా కేసులు, తాజాగా 2,602 మందికి కోవిడ్-19 పాజిటివ్, 534కి చేరిన కరోనా మృతుల సంఖ్య

ఫలితాన్ని కేవలం అరగంటలోనే తెలుసుకోవచ్చు స్క్రీనింగ్‌ పరికరాలు, స్వాబ్‌ను అనుసంధానించే పరికరం, వివరాల నమోదుకు వినియోగించే కంప్యూటర్‌, పీపీఈ కిట్లు అందుబాటులో ఉంచారు. ఈ క్రమంలో నగర, పట్టణ, గ్రామీణ, మన్యం ప్రాంతాల్లో అనుమానితుల నుంచి నమూనాలను సేకరించేందుకు ఐదు బస్సులు (Mobile Sanjeevani bus service) సిద్ధం చేశారు. కరోనా పరీక్షలు చేసేలా బస్సులో సీట్లు తొలగించి ప్రత్యేక సదుపాయాలను ఏర్పాటు చేశారు.

Here's New Mobile COVID-19 Sample Testing Buses

వీటిని గురువారం రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు (Muttamsetti Srinivasa Rao) ప్రభుత్వ ఛాతి ఆస్పత్రిలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం జిల్లాకు ఐదు బస్సులను కేటాయించిందని, ఇందులో అనకాపల్లి డివిజన్‌కు ఒకటి, నర్సీపట్నానికి ఒకటి, పాడేరు డివిజన్‌కు ఒకటి చొప్పున కేటాయించడం జరిగిందన్నారు. నగరంలో రెండు బస్సుల ద్వారా ప్రజలకు కొవిడ్‌ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. అలాగే ప్రతి జిల్లాకు ప్రభుత్వం కొవిడ్‌ ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం కోటి రూపాయలను మంజూరు చేసిందన్నారు.

అనంతరం మంత్రితో పాటు ఎంపీ విజయసాయిరెడ్డి ఆయా బస్సులను పరిశీలించడంతో పాటు కొవిడ్‌ పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, కలెక్టర్‌ వి.వినయ్‌చంద్‌, సీపీ ఆర్కే మీనా, పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.