SC on Royalty Issue: గనులు కలిగిన భూములపై రాయల్టీ, కేంద్రం విజ్ఞప్తిని తిరస్కరించిన సుప్రీంకోర్టు, ఖనిజాలు అధికంగా ఉన్న రాష్ట్రాలకు బకాయిలు చెల్లించాలని కీలక తీర్పు
ఖనిజాలు, గనుల నియంత్రణ, అభివృద్ధిపై పార్లమెంటుకు పూర్తిస్థాయి అధికారాన్ని రాజ్యాంగం కట్టబెట్టలేదని ధర్మాసనం స్పష్టం చేసింది.
New Delhi, August 14: ఖనిజాలు, విధించే హక్కు విషయంలో సుప్రీంకోర్టు గత నెలలో కీలక తీర్పును వెలువరించిన సంగతి విదితమే. ఖనిజాలు, గనుల నియంత్రణ, అభివృద్ధిపై పార్లమెంటుకు పూర్తిస్థాయి అధికారాన్ని రాజ్యాంగం కట్టబెట్టలేదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఆయా భూములపై రాయల్టీ విధించే హక్కు రాష్ట్రాలకూ ఉందని తేల్చిచెప్పింది.ఖనిజాలను కలిగి ఉన్న భూమిపై రాయల్టీని విధించే అధికారం కేంద్రానికి మాత్రమే ఉందని 1989 నాటి తీర్పును ఈ తీర్పు తోసిపుచ్చింది.
దీనిపై కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని తొమ్మిది మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనానికి 1989 నుండి గనులు మరియు ఖనిజాలపై విధించిన రాయల్టీని వాపసు చేయాలన్న రాష్ట్రాల డిమాండ్‌ను తాము వ్యతిరేకిస్తున్నామని, ఇది పౌరులపై ప్రభావం చూపుతుందని, పిఎస్‌యులు ఖాళీ చేయాల్సి ఉంటుందని కేంద్రం తెలిపింది. ప్రాథమిక అంచనాల ప్రకారం ఖజానాకు రూ.70,000 కోట్లు నష్టం వస్తుందని తెలిపింది. ఆగస్టు 22న కాంగ్రెస్ దేశవ్యాప్త ఆందోళన, అదానీ కుంభకోణంలో మోడీ పాత్ర, సెబీ చీఫ్ రాజీనామా చేయాలని డిమాండ్
దీనిపై తాజాగా విచారణ జరిపిన ధర్మాసనం.. కేంద్రం చేసిన విజ్ఞప్తిని తిరస్కరించింది. వచ్చే 12 ఏళ్లలో ఖనిజాలు అధికంగా ఉన్న రాష్ట్రాలకు కేంద్రం, మైనింగ్ కంపెనీలు బకాయిలు చెల్లించవచ్చని పేర్కొంది. అయితే బకాయిల చెల్లింపుపై ఎలాంటి జరిమానా విధించవద్దని బెంచ్ రాష్ట్రాలను ఆదేశించింది.
కాగా గతంలొ ఖనిజాలను కలిగి ఉన్న భూమిపై రాయల్టీని వసూలు చేసే రాష్ట్ర ప్రభుత్వాల హక్కును ఈ తీర్పులో భాగంగా సుప్రీంకోర్టు సమర్థించింది. ఖనిజాలపై పార్లమెంటుకు ఉన్న పన్ను విధించే అధికారం అనేది రాష్ట్రాల నియంత్రణాధికారాన్ని తుడిచిపెట్టేస్తోందని 9 మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. తాజా తీర్పుతో ఒడిశా, జార్ఖండ్, బెంగాల్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి ఖనిజాలు అధికంగా ఉన్న రాష్ట్రాలకు ప్రయోజనం కలుగుతుంది. అక్కడి ప్రభుత్వాలు ఇప్పుడు తమ భూభాగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న మైనింగ్ కంపెనీలపై అదనపు సుంకాలు వసూలు చేసేందుకు దీని ద్వారా అవకాశం ఏర్పడుతుంది.