Congress Party announces nation wide protests on Aug 22 demanding resignation of Madhabi Puri Buch(X)

Delhi, Aug 13:  ఆగస్టు 22న దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. హిండెన్​బర్గ్ ఆరోపణల నేపథ్యంలో అదానీ వ్యవహారంపై జాయింట్​ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) విచారణ జరిపించాలని, సెబీ చీఫ్ మాధబి పురి రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది కాంగ్రెస్ పార్టీ.

దేశంలోని వివిధ నగరాల్లోని ఈడీ కార్యాలయాల ముందు నిరసన చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు కేసీ వేణుగోపాల్.

అదానీ స్కామ్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రమేయం ఉందన్నారు. సెబీ, అదానీల మధ్య అనుబంధంపై సమగ్ర దర్యాప్తు అవసరమని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు.  తుంగభద్ర డ్యామ్‌ను పరిశీలించిన కర్ణాటక సీఎం సిద్దరామయ్య, ఏపీ మంత్రులు, నిర్వహణ లోపంపై చర్చ

మెడీ సర్కార్ వెంటనే సెబీ చీఫ్​ను తప్పించాలనిన్నారు. అలాగే మోడీ నేతృత్వంలోని ఎన్​డీఏ సర్కార్ రాజ్యాంగంపై నిరంతరం దాడి చేస్తోందని మండిపడ్డారు ఖర్గే. దేశవ్యాప్తంగా కుల గణన చేప్టాలని, పెరుగుతున్న నిరుద్యోగం, అనియంత్రిత ద్రవ్యోల్బణంపై చర్యలు ఏవని ప్రశ్నించారు. ఈ సమస్యలపై దేశవ్యాప్తంగా పోరాటం చేస్తామన్నారు ఖర్గే. అగ్నిపథ్‌ పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.