Karnataka, Aug 13: భారీ వర్షాలకు తుంగభద్ర డ్యామ్‌లోని 19వ గేటు కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. చైన్ లింక్ తెగిపోవడంతో గేటు కొట్టుకుపోగా 70 ఏండ్ల డ్యామ్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగడం ఇదే తొలిసారి. ఇక ఇవాళ తుంగభద్ర డ్యామ్‌ను పరిశీలించారు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య. అనంతరం ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.
19వ గేటు స్థానంలో స్టాప్ లాగ్ ఏర్పాటుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. నీరు పూర్తిగా వృథాకక ముందే స్టాప్ లాగ్ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం తుంగభద్ర డ్యామ్‌లో 97 టీఎంసీల నీటి నిల్వ ఉంది. అలాగే ఏపీ మంత్రులు నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్ సైతం తుంగభద్ర డ్యామ్‌ను పరిశీలించారు. స్థానిక డ్యాం, ఇరిగేషన్ అధికారులతో భేటీ అయ్యారు.
నిర్వహణ లోపం కారణంగానే ప్రాజెక్టులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. త్వరలోనే స్టాప్‌లాగ్ గేటు ఏర్పాటు చేస్తామని, భవిష్యత్ కార్యాచరణపై నిపుణులతో చర్చిస్తామన్నారు. తగ్గిన వరద.. శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయం అన్ని గేట్లు మూసివేత.. చేపల వేటకు మత్స్యకారులు
మరోవైపు నీటి ఉధృతికి కొట్టుకపోయిన గేటు కోసం డ్యామ్ పరిసరాల్లో గజ ఈత గాళ్లతో వెతికిస్తున్నారు. టీబీ బోర్డు అధికారులు కొత్త గేట్లను తయారు చేయిస్తుండగా గేట్లను అమర్చడంలో నిపుణులైన కన్నయ్య నాయుడు ఆధ్వర్యంలో నారాయణ ఇంజనీరింగ్, హిందుస్థాన్ కంపెనీలు ప్రతినిధులు మరమ్మతు పనులు జరుగుతున్నాయి